Jio vs Vi vs Airtel - వీటిలో రోజుకు 2GB డేటా ఇచ్చే బెస్ట్ ప్లాన్ ఏదీ
టెలికాం నెట్‌వర్క్ ప్రొవైడర్లు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మధ్య గట్టి పోటీ నెలకొంది. అపరిమిత కాలింగ్, నిర్దిష్ట డేటా ప్లాన్‌లను అందిస్తున్నాయి.వీటిలో రోజుకు 2GB డేటా ఆప్షన్ లో ఏది బెస్టో చూద్దాం.
ఇండియాలో ఒకప్పుడు విచ్చల విడిగా ఉన్న టెలికాం నెట్‌వర్క్ ప్రొవైడర్లు ప్రస్తుతం తగ్గిపోయాయి. ప్రస్తుతం ఓ నాలుగు ఐదు కంపెనీలు మాత్రమే సర్వీసులు అందిస్తున్నాయి. వీటిలో రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా లాంటి కంపెనీలు అపరిమిత కాలింగ్ , నిర్దిష్ట మొత్తంలో మొబైల్ డేటాతో ప్లాన్‌లను అందిస్తున్నాయి. వినియోగదారుల రోజువారీ డేటా అవసరాలపై ఆధారపడి, టెలికాం ఆపరేటర్లు వేరియబుల్ వాలిడిటీతో విభిన్న ప్లాన్‌లను అందిస్తున్నాయి. ప్రస్తుతం Jio, Airtel, Vi నుంచి రోజుకు 2GB మొబైల్ డేటాతో వచ్చే ప్రీ-పెయిడ్ ప్లాన్లలో ఏది బెస్టో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
వోడాఫోన్ ఐడియా
వోడాఫోన్ ఐడియా రోజుకు 2GB డేటాతో వచ్చే పలు ప్లాన్‌లను అందిస్తోంది. 2GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100SMS అందించే చౌకైన ప్లాన్ ధర రూ. 319. ఇది ఒక నెల వరకు చెల్లుబాటు అవుతుంది. ఎక్కువ రోజులు వ్యాలిడిలీ కావాలంటే, రూ. 539, రూ. 839 ప్లాన్ అదే ప్రయోజనాలను అందిస్తాయి. అయితే, అవి వరుసగా 56 రోజులు, 84 రోజులు చెల్లుబాటు అవుతాయి. ఒక సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ సబ్ స్క్రిప్షన్‌తో రోజుకు 2GB మొబైల్ డేటా కోసం చూస్తున్న వారు 84 రోజుల చెల్లుబాటుతో రూ.1066 ప్లాన్ ను పొందే అవకాశం ఉంటుంది.
రిలయన్స్ జియో
రిలయన్స్ జియో రోజుకు 2GB డేటాతో అనేక ప్లాన్‌లను కూడా అందిస్తోంది. కంపెనీ నుండి చౌకైనది ప్లాన్ రూ. 249. ఇది అపరిమిత కాలింగ్‌తో వస్తుంది. 23 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. మీకు ఎక్కువ కాలం ఉండే ప్లాన్ కావాలంటే, 23 రోజులు, 56 రోజులు మరియు 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న రూ.299, రూ.533, రూ.719 ప్లాన్‌లను తీసుకోవచ్చు.
ఎయిర్‌టెల్
ఎయిర్‌టెల్ కూడా రోజుకు 2GB డేటాతో వచ్చే అనేక ప్లాన్‌లను కలిగి ఉంది. అత్యంత తక్కువ ప్లాన్ రూ. 319. ఇది అపరిమిత కాలింగ్‌తో వస్తుంది. ఒక నెల వరకు చెల్లుబాటు అవుతుంది. మీరు Airtel Xstream యాప్‌ని యాక్సెస్ చేయాలనుకుంటే, అదే ప్లాన్ ధర రూ. 359. దీర్ఘకాలిక ప్లాన్ కోసం చూస్తున్న వారికి, 56 రోజుల వ్యాలిడిటీతో రూ. 549 ప్లాన్, 84 రోజుల చెల్లుబాటుతో రూ. 839 ప్లాన్ కొనుగోలు చేయవచ్చు.
రోజుకు 2GB డేటాతో బెస్ట్ ప్లాన్ ఏది?
మీరు ఒక నెల పాటు ఉండే ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, రిలయన్స్ జియో నుండి 28 రోజుల చెల్లుబాటు కలిగిన రూ. 299 ప్లాన్ చాలా చీప్ అండ్ బెస్ట్ గా చెప్పుకోవచ్చు. ప్రతి నెల రీఛార్జ్ చేయకూడదనుకునే వారికి Jio, 56 రోజుల వ్యాలిడిటీతో రూ. 533, 84 రోజుల వ్యాలిడిటీతో రూ. 719 ప్లాన్లు తీసుకోవచ్చు. OTT ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ కావాలనుకుంటే, డిస్నీ+ హాట్‌స్టార్, Airtel Xstream యాప్ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే ఎయిర్‌టెల్ రూ. 359 ప్లాన్, ఒక సంవత్సరం యాక్సెస్‌ను అందించే Vodafone రూ.1066 ప్లాన్ బెస్ట్ ఎంపికలుగా చెప్పుకోవచ్చు.
Read Also: బడ్జెట్ ధరలో 64 MP కెమెరాతో Vivo నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్, సేల్ ఎప్పటి నుంచి అంటే?