Redmi A3 Sale: రెడ్‌మీ ఏ3 సేల్ ప్రారంభం - 12 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే కొనేయచ్చు!
Redmi New Phone: రెడ్‌మీ ఏ3 స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
Redmi A3 Flipkart Sale: రెడ్‌మీ ఏ3 స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. దీనికి సంబంధించిన సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో నేడు (ఫిబ్రవరి 23వ తేదీ శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలైంది. ఈ ఫోన్‌లో 6.71 అంగుళాల భారీ డిస్‌ప్లేను అందించారు. 6 జీబీ వరకు ర్యామ్ అందుబాటులో ఉంది. దీన్ని ర్యామ్ ఎక్స్‌టెన్షన్ ద్వారా 12 జీబీ వరకు పెంచుకోవచ్చు. మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌ను రెడ్‌మీ ఈ ఫోన్‌లో అందించింది.
రెడ్‌మీ ఏ3 ధర (Redmi A3 Price in India)
రెడ్‌మీ ఏ3లో మూడు వేరియంట్లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,299గా నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.8,299గానూ, టాప్ ఎండ్ మోడల్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.9,299గానూ ఉంది. మిడ్‌నైట్ బ్లాక్, లేక్ బ్లూ, ఆలివ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో రెడ్‌మీ ఏ3 కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కాం అధికారిక వెబ్ సైట్లతో పాటు ఎంఐ హోం స్టోర్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో దీని సేల్ ప్రారంభం అయింది.
రెడ్‌మీ ఏ3 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Redmi A3 Specifications)
ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టంపై రెడ్‌మీ ఏ3 పని చేయనుంది. ఇందులో 6.71 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 6 జీబీ ర్యామ్ వరకు అందించారు. ర్యామ్ ఎక్స్‌టెన్షన్ టెక్నాలజీ ద్వారా 12 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. అంటే 12 జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ రూ.10 వేలలోపే దక్కించుకోవచ్చన్న మాట.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్. దీంతో పాటు మరో సెకండరీ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 128 జీబీ వరకు స్టోరేజ్‌ను రెడ్‌మీ ఇందులో అందించింది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
డ్యూయల్ 4జీ వోల్టే, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లోనాస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, వైఫై, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎఫ్ఎం రేడియో బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో అందుబాటులో అందించారు. రెడ్‌మీ ఏ3 బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 10W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్ మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 199 గ్రాములుగా (మిడ్‌నైట్ బ్లాక్, లేక్ బ్లూ కలర్ ఆప్షన్లు) ఉంది. ఆలివ్ గ్రీన్ కలర్ వేరియంట్ బరువు కాస్త తక్కువగా 193 గ్రాములు మాత్రమే ఉండనుంది.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?