అన్వేషించండి

Redmi 10C: రెడ్‌మీ కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది - ధర రూ.15 వేలలోపే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే రెడ్‌మీ 10సీ.

Redmi 10C: రెడ్‌మీ 10సీ స్మార్ట్ ఫోన్ నైజీరియాలో లాంచ్ అయింది. ఈ ఫోన్ మూడు కొత్త రంగుల్లో లాంచ్ అయింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను అందించారు. వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఫోన్ వెనకవైపు చదరపు ఆకారంలో కెమెరా మాడ్యూల్‌ను అందించారు. 2020లో లాంచ్ అయిన రెడ్‌మీ 9సీకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది.

షియోమీ నైజీరియా ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ ఫోన్ లాంచ్‌ను ప్రకటించింది. ఈ ఫోన్ ప్రస్తుతానికి షియోమీ అధికారిక వెబ్‌సైట్‌లో ఇంకా లిస్ట్ కాలేదు. ఈ ఫోన్‌కు సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది.

రెడ్‌మీ 10సీ ధర
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 78,000 నైరాలుగా (సుమారు రూ.14,300) నిర్ణయించారు. ఇక 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 87,000 నైరాలుగా (సుమారు రూ.16,000) ఉంది. బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ కానుంది.

నైజీరియాలోని రిటైలర్ల వద్ద ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 3సీ హబ్, స్లాట్.ఎన్‌జీ, ఫినెట్ వంటి వెబ్ సైట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. రెడ్‌మీ 10సీ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. రెడ్‌మీ 9సీ మలేషియాలో 429 రింగెట్ల (సుమారు రూ.7,500) ధరతో లాంచ్ అయింది.

రెడ్‌మీ 10సీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.71 అంగుళాల వాటర్ డ్రాప్ నాచ్ డిస్‌ప్లేను అందించారు.ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను అందించారు. 4 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. ఫోన్ వెనకవైపు చదరపు ఆకారంలో కెమెరాలు అందించారు.

ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వెనకవైపు అందుబాటులో ఉంది. ఇందులో వెనకవైపు 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. మనదేశంలో కూడా రెడ్‌మీ 10సీ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?

Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gizinfo (@gizinfo)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Petrol Price Hike: షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
Iran War Updates: హెర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత - ఇరాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహం!
హెర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత - ఇరాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహం!
MNM Election Symbol: లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
Electric Vehicles: ఇరాన్ చమురు సంక్షోభంతో ఈవీల వెంట పరుగులు తీస్తున్న జనం! పెరిగిన BYD, విన్‌ఫాస్ట్ విక్రయాలు!
ఇరాన్ చమురు సంక్షోభంతో ఈవీల వెంట పరుగులు తీస్తున్న జనం! పెరిగిన BYD, విన్‌ఫాస్ట్ విక్రయాలు!

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol Price Hike: షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
Iran War Updates: హెర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత - ఇరాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహం!
హెర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత - ఇరాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహం!
MNM Election Symbol: లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
Electric Vehicles: ఇరాన్ చమురు సంక్షోభంతో ఈవీల వెంట పరుగులు తీస్తున్న జనం! పెరిగిన BYD, విన్‌ఫాస్ట్ విక్రయాలు!
ఇరాన్ చమురు సంక్షోభంతో ఈవీల వెంట పరుగులు తీస్తున్న జనం! పెరిగిన BYD, విన్‌ఫాస్ట్ విక్రయాలు!
Telangana new education system: తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Telangana Budget 2026-27: 1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షలు ఇన్సూరెన్స్ - తెలంగాణ బడ్జెట్ 3 లక్షల 24 వేల 234 కోట్లు!
1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షలు ఇన్సూరెన్స్ - తెలంగాణ బడ్జెట్ 3 లక్షల 24 వేల 234 కోట్లు!
Telangana Budget 2026-27 Live Updates: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం... వారికి 2 వేల స్కాలర్షిప్
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం... వారికి 2 వేల స్కాలర్షిప్
Ustaad Bhagat Singh Collection Day 1 : ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget