Redmi 10 India Launch: రెడ్‌మీ 10 లాంచ్ తేదీ వచ్చేసింది - రూ.12 వేలలోపే - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూడండి!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ మనదేశంలో తన కొత్త బడ్జెట్ ఫోన్ రెడ్‌మీ 10ను త్వరలో లాంచ్ చేయనుంది.
Redmi 10 Launch: రెడ్‌మీ 10 స్మార్ట్ ఫోన్ మనదేశంలో మార్చి 17వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని షియోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్‌లో వాటర్ డ్రాప్ తరహా డిస్‌ప్లే ఉండనుంది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఇంతకుముందు వచ్చిన మోడల్ కంటే రెండు రెట్లు వేగంగా ఇది పనిచేయనుందని తెలుస్తోంది. రెడ్‌మీ 10లో వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి.
రెడ్‌మీ 10 ఇండియా లాంచ్ వివరాలు
రెడ్‌మీ ఇండియా అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా దీని లాంచ్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. షియోమీ దీనికి సంబంధించిన మీడియా ఇన్వైట్లను కూడా పంపింది.దీంతోపాటు రెడ్‌మీ 10ను టీజ్ చేస్తూ మీడియా ఇన్వైట్ కూడా పంపింది. గతేడాది లాంచ్ అయిన గ్లోబల్ వేరియంట్ కంటే ఇందులో స్పెసిఫికేషన్లు కొత్తగా ఉండనున్నాయి.
రెడ్‌మీ 10 స్పెసిఫికేషన్లు (అంచనా)
మైక్రోసైట్ ప్రకారం... రెడ్‌మీ 10లో వాటర్ డ్రాప్ తరహా డిస్‌ప్లే నాచ్ ఉండనుంది. ఇందులో 6 ఎన్ఎం క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ఉండనుంది. గ్లోబల్ మోడళ్లలో మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌ను అందించారు.
ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. రెడ్‌మీ 10, రెడ్‌మీ 10 2022 మోడల్స్ గ్లోబల్ మార్కెట్లో నాలుగు కెమెరాలతో లాంచ్ అయ్యాయి. వీటితో పోలిస్తే ఇందులో తక్కువ కెమెరాలే ఉన్నాయి.
ఇక ఇండియన్ వేరియంట్ లుక్ కూడా కొంచెం కొత్తగా ఉండనుంది. ఈ మైక్రో సైట్ ప్రకారం... మనదేశంలో లాంచ్ కానున్న వేరియంట్ స్మడ్జ్ ఫ్రీ ఫినిష్‌తో రానుంది. వెనకవైపు టెక్చర్ డిజైన్ కూడా ఉండనుంది. అల్ట్రా ఫాస్ట్ స్టోరేజ్, మ్యాసివ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ అని కంపెనీ వీటిని టీజ్ చేసింది. ఇందులో గ్రాండ్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది.
దీని ఇండియన్ వేరియంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ వెనకవైపు ఉండే అవకాశం ఉంది. రెడ్‌మీ 10, రెడ్‌మీ 10 2022 గ్లోబల్ వేరియంట్లలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఈ ఫోన్ ఫీచర్లను బట్టి చూస్తే ధర రూ.12 వేలలోనే ఉండనుంది.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?