![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Realme Narzo N63: రూ.8 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరాతో నార్జో ఎన్53!
Realme New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే రియల్‌మీ నార్జో ఎన్63. దీని ధర రూ.8,499 నుంచి ప్రారంభం కానుంది.
![Realme Narzo N63: రూ.8 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరాతో నార్జో ఎన్53! Realme Narzo N63 Launched in India Check Price Specifications Features Details in Telugu Realme Narzo N63: రూ.8 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరాతో నార్జో ఎన్53!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/8ffe028b246f3146767abe6ffe59b3261717590142536252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Realme Narzo N63 Launched: రియల్‌మీ నార్జో ఎన్63 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆక్టాకోర్ చిప్‌సెట్‌తో అందుబాటులోకి రానుంది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ప్రీమియం వేగన్ లెదర్ ఆప్షన్‌తో దీన్ని కొనుగోలు చేయవచ్చు. గతంలో లాంచ్ అయిన రియల్‌మీ నార్జో ఎన్53కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది.
రియల్‌మీ నార్జో ఎన్63 ధర (Realme Narzo N63 Price in India)
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.8,499గా నిర్ణయించారు. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999గా ఉంది. అమెజాన్, రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. జూన్ 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది.
రియల్‌మీ సైట్ నుంచి ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.500 తగ్గింపు లభించనుంది. అంటే రూ.7,999 నుంచే దీని ధర ప్రారంభం కానుందన్న మాట. లెదర్ బ్లూ, ట్విలైట్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. లెదర్ బ్లూ కలర్ మాత్రమే వేగన్ లెదర్ ఫినిష్‌తో లభించనుంది.
Also Read: గేమింగ్ హబ్‌గా మారుతున్న యూట్యూబ్ - ప్లేయబుల్స్‌ను లాంచ్ చేసిన కంపెనీ!
రియల్‌మీ నార్జో ఎన్63 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Realme Narzo N63 Specifications)
రియల్‌మీ నార్జో ఎన్63 స్మార్ట్ ఫోన్‌లో 6.74 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 4 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కూడా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ లెన్స్ అందించారు. ఎయిర్ జెస్చర్, డైనమిక్ బటన్, మినీ క్యాప్సూల్ 2.0 వంటి సాఫ్ట్‌వేర్ ఫీచర్లను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 50000 ఎంఏహెచ్ కాగా, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. 3.5 ఎంఎం ఆడియో జాక్ ద్వారా ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేయవచ్చు. డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ54 ఫీచర్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. అంటే దుమ్ము పడినా, ఫోన్ మీద నీరు చిందినా పెద్ద సమస్యేమీ ఉండదు. కానీ ఎక్కువ నీళ్లు పడితే మాత్రం ఏమైనా అవుతుందేమో చెప్పలేం.
Read Also: 10 వేల లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు - మిడిల్ క్లాస్ కోసం బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్, సూపర్ సౌండ్‌తో
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)