Realme GT Master Edition: రియల్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జీటీ మాస్టర్ ఎడిషన్ వచ్చేస్తుంది
రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ ఫోన్లను ఆగస్టు 18న భారతదేశంలో చేయనున్నట్లు సంస్థ సీఈఓ మాధవ్ సేథ్ ధ్రువీకరించారు. జీటీ మాస్టర్ ఎడిషన్ కొత్త వేరియంట్ సూట్‌కేస్ ఆరెంజ్ రంగులో ఉండనుంది.
రియల్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ ఫోన్ భారతదేశంలో లాంచ్ కానుంది. రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్‌ను ఆగస్టు 18వ తేదీన భారతదేశంలో విడుదల చేయనున్నట్లు సంస్థ సీఈఓ మాధవ్ సేథ్ ధ్రువీకరించారు. రియల్‌మీ గత నెలలో జీటీ మాస్టర్ ఎడిషన్‌ను చైనాలో విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఎడిషన్‌ను భారతదేశంలోనూ లాంచ్ చేయనున్నట్లు కన్ఫామ్ చేసింది.
చైనాలో ఈ ఫోన్లను సూట్‌కేస్ ఆప్రికాట్, సూట్‌కేస్ గ్రే కలర్ వేరియంట్లలో విడుదల చేయగా.. మనకు ఇంకో కలర్ వేరియంట్‌ను జత చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఆన్‌లైన్ లీకుల ద్వారా బయటకు వచ్చాయి. ఆన్ లీక్స్, డిజిట్ సంస్థలు దీనిపై ట్వీట్ చేశాయి.
[Exclusive] @realmeIndia #realmeGTMasterEdition special colour variant to launch in India on August 18https://t.co/91bLrt3ygq pic.twitter.com/30qY15FG4v
— Digit (@digitindia) August 5, 2021
And this is the #RealmeGT Master Edition’s upcoming special color option designed to celebrate #Realme being the fastest smartphone brand to reach 100M sales…
— Steve H.McFly (@OnLeaks) August 5, 2021
On behalf of @digitindia -> https://t.co/nW2cTv6ZjX pic.twitter.com/GE9U13WclR
దీనిని బట్టి చూస్తే జీటీ ఎక్స్‌ప్లోరర్ మాస్టర్ ఎడిషన్ కొత్త వేరియంట్ సూట్‌కేస్ ఆరెంజ్ రంగులో ఉండనుంది. దీని కింద భాగంలో ‘100M Fans' అని ఉంది. రియల్‌మీ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించిన నేపథ్యంలో దీనికి 100M Fans అని రాసినట్లు తెలుస్తోంది. ఇక డిజైన్ ప్రకారం చూసుకుంటే.. నవోటో ఫుకసావా గతంలో రూపొందించిన ఫోన్ల తరమా డిజైన్ మాదిరిగానే మాస్టర్ ఎడిషన్ ఫోన్ ఉండనుంది.
Also Read: Realme Watch 2: రియల్‌మీ కొత్త వాచ్‌లు వచ్చేసాయి.. ధర, ఫీచర్లు ఇవే..
91 మొబైల్స్ అందించిన నివేదిక ప్రకారం.. జీటీ మాస్టర్ ఎడిషన్లో రెండు వేరియంట్లు ఉండనున్నాయి. వీటిలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.30,500గా (349 యూరోలు).. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,900గా (399 యూరోలు) ఉండనుంది.
చైనాలో విడుదలైన .. జీటీ మాస్టర్ ఎడిషన్ ఫోన్‌లో 6.43 అంగుళాల శాంసంగ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 Hzగా, టచ్ శాంప్లింగ్ రేట్ 360 Hzగా ఉంది. ఇందులో మెయిన్ కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా అందించారు. దీనిలో 4300 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ అందించారు. 65 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది.
Also Read: Realme 8i, 8s Launch India: రియల్‌మీ 8 సిరీస్ కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయి..