News
News
X

Realme Watch 2: రియల్‌మీ కొత్త వాచ్‌లు వచ్చేసాయి.. ధర, ఫీచర్లు ఇవే..

Realme Watch 2 Launched: రియల్‌మీ నుంచి రెండు స్మార్ట్ వాచ్‌లు విడుదల అయ్యాయి. రియల్‌మీ వాచ్ 2, రియల్‌మీ వాచ్ 2 ప్రో అనే రెండు స్మార్ట్ వాచ్‌లను సంస్థ భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది.

FOLLOW US: 

స్మార్ట్ వాచ్ ప్రియులకు గుడ్ న్యూస్. ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ నుంచి రెండు స్మార్ట్ వాచ్‌లు విడుదల అయ్యాయి. రియల్‌మీ వాచ్ 2, రియల్‌మీ వాచ్ 2 ప్రో అనే రెండు స్మార్ట్ వాచ్‌లను సంస్థ భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇవి రెండూ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తున్నాయి. రియల్‌మీ వాచ్ 2 ధర రూ.2,999గా.. రియల్‌మీ వాచ్ 2 ప్రో ధర రూ.4,999గా నిర్ణయించింది. ఈ రెండు వాచ్‌లలో డిస్‌ప్లే, బ్యాటరీ లైఫ్‌లలో ప్రధాన తేడా కనిపిస్తోంది. యాక్టివిటీ ట్రాకింగ్, జీపీఎస్, స్పోర్ట్ మోడ్స్, స్లీప్ ట్రాకింగ్ వంటివి రెండింటిలోనూ ఉన్నాయి. 
2020లో రియల్‌మీ నుంచి వచ్చిన రియల్‌మీ వాచ్ మాదిరిగానే ఈ రెండింటిలో కూడా స్క్వేర్ స్క్రీన్ ఉండగా.. డిజైన్, ఫీచర్లలో మాత్రం తేడా కనిపిస్తోంది. 

స్పెసిఫికేషన్లు ఇవే.. 

 • రియల్‌మీ వాచ్ 2లో 1.4 అంగుళాల (320x320 పిక్సెల్స్) డిస్‌ప్లే ఉంటుంది. స్క్రేర్ డయల్ ఉంది. దీని బ్యాటరీ లైఫ్ 12 రోజులుగా ఉంది.
 • ఇక రియల్‌మీ వాచ్ 2లో వచ్చేసరికి 1.75 (320x385 పిక్సెల్స్) అంగుళాల కలర్ టచ్ స్క్రీన్ ఉంటుంది. దీని బ్యాటరీ లైఫ్ 14 రోజులుగా ఉంది. ఇందులో స్క్రీన్ టూ బాడీ రేషియో కూడా ఎక్కువగానే ఉంది. 
 • వీటిలో బాస్కెట్ బాల్, బాక్సింగ్, డ్యాన్సింగ్, గోల్ఫ్, ఇండోర్ సైక్లింగ్, ఔట్ డోర్ రన్నింగ్, టేబుల్ టెన్నిస్, యోగా సహా 90 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. 

 • హైడ్రేషన్ రిమైండర్, సెడెంటరీ రిమైండర్, కెమెరా కంట్రోల్, మీడియేషన్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
 • హార్ట్ రేట్, SpO2 ట్రాకింగ్, బ్లూటూత్ వీ5, స్లీప్ ట్రాకింగ్ కూడా ఉంటాయి. ఐపీ 68 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ ను కలిగి ఉన్నాయి. 
 • 38 గ్రాముల లైట్ వెయిట్ బరువును కలిగి ఉన్నాయి.
 • స్టైలిష్ వాచ్ స్ట్రాప్స్ తో ఇవి అందుబాటులోకి వచ్చాయి. 
 • రియల్‌మీ వాచ్ 2 ప్రోలో అదనంగా మ్యూజిక్ కంట్రోల్, కెమెరా కంట్రోల్, కాల్ రిజెక్షన్ ఆప్షన్లు ఉన్నాయి. ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్ట్రాగ్రామ్, ట్విట్టర్ సహా పలు యాప్స్ (స్మార్ట్) నోటిఫికేషన్లను అందిస్తుంది. స్పేస్ గ్రే, మెటాలిక్ సిల్వర్ కలర్స్ లో లభిస్తుంది. 
 • రియల్ మీ డాట్ కామ్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సహా లోకల్ స్టోర్స్ లో వీటిని కొనుగోలు చేయవచ్చు. 

బడ్స్ వైర్ లెస్ 2 సిరీస్.. 
రియల్‌మీ స్మార్ట్ వాచ్‌లతో పాటు బడ్స్ వైర్ లెస్ 2 సిరీస్ (నెక్ బ్యాండ్ స్టైల్), బడ్స్ క్యూ 2 నియో ట్రూ వైర్ లెస్ స్ట్రీరియో (టీడబ్ల్యూఎస్) లను కూడా విడుదల చేసింది. రియల్‌మీ బడ్స్ వైర్ లెస్ 2 ధర రూ.2,299 కాగా.. రియల్‌మీ బడ్స్ క్యూ2 నియో ధర రూ.1599గా ఉంది. 

Published at : 24 Jul 2021 10:47 AM (IST) Tags: Realme Watch 2 series Realme Watch 2 released in India Realme Watch Specs Realme SmartWatches

సంబంధిత కథనాలు

YouTube: యూజర్లకు యూట్యూబ్ షాక్, ఇకపై డబ్బులు చెల్లిస్తేనే ఆ వీడియోలు చూసే అవకాశం!

YouTube: యూజర్లకు యూట్యూబ్ షాక్, ఇకపై డబ్బులు చెల్లిస్తేనే ఆ వీడియోలు చూసే అవకాశం!

Moto G72: రూ.15 వేలలోపే 108 మెగాపిక్సెల్ ఫోన్ - అదిరిపోయే కెమెరా మొబైల్ లాంచ్ చేసిన మోటో!

Moto G72: రూ.15 వేలలోపే 108 మెగాపిక్సెల్ ఫోన్ - అదిరిపోయే కెమెరా మొబైల్ లాంచ్ చేసిన మోటో!

Lava Blaze 5G: ఇదీ ఇండియన్ బ్రాండ్ అంటే - దేశంలోనే అత్యంత 5జీ ఫోన్ లాంచ్ చేసిన లావా!

Lava Blaze 5G: ఇదీ ఇండియన్ బ్రాండ్ అంటే - దేశంలోనే అత్యంత 5జీ ఫోన్ లాంచ్ చేసిన లావా!

Covidfitbit: ఈ స్మార్ట్ వాచ్ చాలా స్పెషల్ - కోవిడ్ ను కూడా గుర్తించగలదు!

Covidfitbit: ఈ స్మార్ట్ వాచ్ చాలా స్పెషల్ - కోవిడ్ ను కూడా గుర్తించగలదు!

Oneplus Nord Watch: వన్‌ప్లస్ నార్డ్ వాచ్‌లో 105 స్పోర్ట్స్ మోడ్స్ - అఫీషియల్‌గా ప్రకటించిన కంపెనీ

Oneplus Nord Watch: వన్‌ప్లస్ నార్డ్ వాచ్‌లో 105 స్పోర్ట్స్ మోడ్స్ - అఫీషియల్‌గా ప్రకటించిన కంపెనీ

టాప్ స్టోరీస్

Amit Shah Jammu Kashmir Visit: 'మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్'- పాక్‌తో చర్చలపై అమిత్ షా

Amit Shah Jammu Kashmir Visit: 'మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్'- పాక్‌తో చర్చలపై అమిత్ షా

Cheetah Helicopter Crash: ఆర్మీ చీతా హెలికాప్టర్ క్రాష్- పైలట్ మృతి!

Cheetah Helicopter Crash: ఆర్మీ చీతా హెలికాప్టర్ క్రాష్- పైలట్ మృతి!

BRS Odelu : ఉదయం టీఆర్ఎస్‌లో చేరిక - మధ్యాహ్నం బీఆర్ఎస్‌ లీడర్ ! కాంగ్రెస్‌కు షాకిచ్చిన మాజీ ఎమ్మెల్యే

BRS Odelu :  ఉదయం టీఆర్ఎస్‌లో చేరిక - మధ్యాహ్నం బీఆర్ఎస్‌ లీడర్ ! కాంగ్రెస్‌కు షాకిచ్చిన మాజీ ఎమ్మెల్యే

Ajinkya Rahane Becomes Father: మగ బిడ్డకు జన్మనిచ్చిన రహానే భార్య- శుభవార్తను అభిమానులతో పంచుకున్న క్రికెటర్

Ajinkya Rahane Becomes Father: మగ బిడ్డకు జన్మనిచ్చిన రహానే భార్య- శుభవార్తను అభిమానులతో పంచుకున్న క్రికెటర్