Realme 12X 5G Price: రూ.12 వేలలోనే రియల్‌మీ కొత్త 5జీ ఫోన్ - సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, భారీ డిస్‌ప్లే కూడా!
Realme 12X 5G: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్ ధరను ప్రకటించింది. రూ.12 వేలలోపు ధరతోనే ఈ ఫోన్ లాంచ్ అయింది.

Realme New Phone: రియల్‌మీ 12ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఏప్రిల్ 2వ తేదీన లాంచ్ కానుంది. ఈ ఫోన్ లాంచ్‌కు ముందు కంపెనీ దీని ధర ఎంత లోపు ఉండవచ్చో వెల్లడించింది. దీంతోపాటు ఈ ఫోన్ 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుందని తెలిపింది. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. ఈ ఫోన్ చైనా మార్కెట్లో ఇటీవలే లాంచ్ అయింది.
ఈ స్మార్ట్ ఫోన్ ధర మనదేశంలో రూ.12 వేలలోపే ఉంటుందని రియల్‌మీ ప్రకటించింది. అలాగే ఈ ప్రకటనలో మరిన్ని వివరాలు రివీల్ చేసింది. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసే 6.72 అంగుళాల భారీ డిస్‌ప్లే ఈ ఫోన్‌లో ఉండనుంది. దీని పీక్ బ్రైట్‌నెస్ 950 నిట్స్‌గా ఉంది. డ్యూయల్ స్పీకర్లు ఇందులో ఉండనున్నాయి. దీని మందం 0.77 సెంటీమీటర్లు మాత్రమే. రూ.12 వేలలోపు ధరలో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, డ్యూయల్ స్పీకర్లు ఉన్న మొట్టమొదటి ఫోన్ ఇదే అని కంపెనీ అంటోంది.
No wonder, it was a well kept secret!💪
— realme (@realmeIndia) March 27, 2024
Unlock the power of #EntryLevel5GKiller, India’s first 45W 5G phone under 12K!
Launching on 2nd April, 12 Noon
Know more: https://t.co/cwWdl8GHSJ#realme12x5G pic.twitter.com/Ui2CWmijxN
ఈ ఫోన్ చైనీస్ వేరియంట్ తరహాలోనే ఇండియన్ వేరియంట్లో కూడా 6 ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ 5జీ ప్రాసెసర్ ఉండనుంది. వీసీ కూలింగ్ ఛాంబర్ కూడా ఈ ఫోన్‌తో అందించనున్నారు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. ఎయిర్ జెస్చర్ ఫీచర్ ద్వారా ఫోన్‌ను ముట్టుకోకుండానే ఆపరేట్ చేయవచ్చు.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?
ఏప్రిల్ 2వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన మైక్రోసైట్ కూడా కంపెనీ ఇండియా వెబ్‌సైట్లో లైవ్ అయింది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు కూడా ఇందులో టీజ్ చేశారు.
రియల్‌మీ 12ఎక్స్ స్మార్ట్ ఫోన్ చైనాలో ఈ నెల ప్రారంభంలోనే లాంచ్ అయింది. అక్కడ దీని ధరను 1,399 యువాన్లుగా (సుమారు రూ.16,000) నిర్ణయించారు. ఇప్పుడు అంతకంటే తక్కువ ధరలో మనదేశంలో లాంచ్ కానుందని ప్రకటించారు. రియల్‌మీ 12 సిరీస్‌లో ఇంతకు ముందు కూడా కొన్ని ఫోన్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. వీటిలో రియల్‌మీ 12 5జీ ధర రూ.16,999గానూ, రియల్‌మీ 12 ప్లస్ 5జీ ధర రూ.20,999గానూ ఉంది. ఈ రెండు ఫోన్లూ ఇప్పటికే వినియోగదారులకు కూడా అందుబాటులో ఉన్నాయి. రెడ్‌మీ నోట్ సిరీస్ ఫోన్లతో రియల్‌మీ 12 సిరీస్ ఫోన్లు పోటీ పడనున్నాయి.
Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

