(Source: ECI/ABP News/ABP Majha)
PUBG New State: పబ్జీ కొత్త గేమ్ వచ్చేస్తుంది.. ఇంకా మెరుగైన గ్రాఫిక్స్, అదిరిపోయే గేమ్‌ప్లే!
క్రాఫ్టన్ ఇటీవలే పబ్జీ: న్యూ స్టేట్ అనే గేమ్‌కు సంబంధించి ప్రీ-రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. ఈ గేమ్ 40 మిలియన్ల ప్రీ-రిజిస్ట్రేషన్ల మైలురాయిని దాటింది.
దక్షిణకొరియాకు చెందిన గేమ్ డెవలపర్ కంపెనీ క్రాఫ్టన్ పబ్జీ: న్యూ స్టేట్ అనే గేమ్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఈ గేమ్ 40 మిలియన్ల ప్రీ-రిజిస్ట్రేష్లన మైలురాయిని దాటింది. గూగుల్ ప్లేస్టోర్, యాప్ స్టోర్‌ల్లో ఈ గేమ్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ గేమ్‌కు సంబంధించిన ప్రస్తుతం 28 దేశాల్లో రెండో ఆల్ఫా దశ టెస్టింగ్ జరుగుతుంది.
ఈ గేమ్‌కు సంబంధించిన ప్రీ-ఆర్డర్లు మనదేశంలో ప్రారంభం అయ్యాయి. దీంతో ప్రీ-రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా బాగా పెరిగిందని కంపెనీ ప్రకటనలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పబ్జీకి ఉన్న ఫ్యాన్స్, వారికి ఉన్న ఉత్సాహం, పబ్జీ స్టూడియోస్‌పై వారికి ఉన్న నమ్మకం కారణంగానే ఈ స్థాయి ఆదరణ సాధ్యం అయిందని పబ్జీ: న్యూ స్టేట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మింక్యు పార్క్ అన్నారు.
Also Read: Samsung New Phone: శాంసంగ్ కొత్త ఫోన్ వచ్చేసింది.. ఆ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్!
పబ్జీ: న్యూ స్టేట్ రెండో ఆల్ఫా టెస్ట్ తర్వాత రావాల్సిన ఫీడ్‌బ్యాక్ కోసం తాము ఎంతగానో ఎదురు చూస్తున్నామని పార్క్ అన్నారు. ఆ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా గేమ్‌ను మెరుగుపరిచి ఈ సంవత్సరం తర్వాత లాంచ్ చేస్తామని పేర్కొన్నారు. పబ్జీ: న్యూ స్టేట్ గేమ్ అధికారికంగా అక్టోబర్‌లో లాంచ్ కానుందని కంపెనీ ప్రకటించింది.
ఎంటర్‌టైన్‌మెంట్, స్టెబిలిటీ, క్వాలిటీ విషయంలో అభిమానుల అంచనాలను అందుకోవడానికి తమ వద్ద ఉన్న వనరులన్నీ పణంగా పెడుతున్నామని పార్క్ తెలిపారు. 2021లో పబ్జీ: న్యూ స్టేట్ గేమ్‌ను ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారులు ఉచితంగా ఆడవచ్చు.
పబ్జీ: బ్యాటిల్ గ్రౌండ్ ఒరిజినల్ బ్యాటిల్ రాయల్ అనుభవాన్ని రీక్రియేట్ చేస్తూ.. అత్యంత సహజంగా కనిపించే బ్యాటిల్ రాయల్ గేమ్‌ను పబ్జీ: న్యూ స్టేట్ రూపంలో రూపొందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఇటీవలే మనదేశంలో 50 మిలియన్ డౌన్‌లోడ్ల మైలురాయిని దాటింది. దీని రేటింగ్ కూడా 4.4 ఉండటం విశేషం.
Also Read: Realme Vs Redmi: రియల్‌మీ 8ఐ వర్సెస్ రెడ్‌మీ 10 ప్రైమ్.. రూ.15 వేలలో బెస్ట్ ఫోన్ ఇదే!
Also Read: Microsoft: పాస్‌వర్డ్ మర్చిపోతున్నారా.. మీలాంటి వాళ్ల కోసమే కొత్త టెక్నాలజీ వచ్చింది!
Also Read: Ola Electric Scooter: అమ్మకాల్లో ఓలా స్కూటర్ రికార్డు.. మొత్తం టూవీలర్ ఇండస్ట్రీనే మించేలా.. ఎన్ని అమ్ముడుపోయాయంటే?
Also Read: Nokia C01 Plus: రూ.6 వేలలోపే నోకియా కొత్త ఫోన్.. ఆండ్రాయిడ్ 11తో లాంచ్.. జియో యూజర్లకు ఆఫర్ కూడా!