ChatGPT: మొదటిసారి పతనం చూసిన ఛాట్‌జీపీటీ - జూన్‌లో 9.7 శాతం డ్రాప్!
ఛాట్‌జీపీటీ మొట్టమొదటిసారి డౌన్‌ఫాల్‌ను చవిచూసింది.
గతేడాది నవంబర్‌లో లాంచ్ అయినప్పటి నుంచి ప్రపంచ మార్కెట్లో ఛాట్‌జీపీటీ ఒక సంచలనం. ఈ మోస్ట్ పాపులర్ ఏఐ ఛాట్‌బోట్‌కు మొదటిసారి ఎదురుదెబ్బ తగిలింది. ఛాట్‌జీపీటీ నెలవారీ ట్రాఫిక్ మొదటిసారి పడిపోయిందని, నెలవారీ యూనిక్ యూజర్స్ సంఖ్య జూన్‌లో తగ్గిందని సిమిలర్‌వెబ్ అనే అనాలసిస్ సంస్థ పేర్కొంది. మే నెలతో పోలిస్తే జూన్‌లో ఛాట్‌జీపీటీ మొబైల్, వెబ్‌సైట్ ట్రాఫిక్ 9.7 శాతం తగ్గిందని తెలుస్తోంది. అలాగే యూనిక్ యూజర్స్ సంఖ్య కూడా 5.7 శాతం తగ్గింది. దీంతో పాటు సైట్‌కు వచ్చిన విజిటర్స్ 8.5 శాతం తక్కువ టైమ్ స్పెండ్ చేశారట.
లాంచ్ అయినప్పటి నుంచి ఛాట్‌జీపీటీ రైటింగ్, కోడింగ్ అనేక డైలీ టాస్క్‌ల్లో యూజర్లకు సాయం చేస్తూ చాలా ఫేమస్ అయింది. లాంచ్ అయిన రెండు నెలల్లోనే ఛాట్‌జీపీటీ నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 100 మిలియన్లకు చేరుకుంది.
ప్రస్తుతం ఛాట్‌జీపీటీ నెలవారీ విజిట్స్ సంఖ్య 1.5 బిలియన్లుగా ఉందట. అంటే దాదాపు 150 కోట్లు. ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్ 20 వెబ్‌సైట్లలో ఛాట్‌జీపీటీ కూడా ఉంది. ఈ సక్సెస్ కారణంగా మైక్రోసాఫ్ట్ తన సెర్చింజన్ బింగ్‌లో ఓపెన్ఏఐ టెక్నాలజీని యాడ్ చేసింది.
మే నెలలో ఐవోఎస్ ప్లాట్‌ఫాం కోసం ఛాట్‌జీపీటీ యాప్‌ను ఓపెన్ఏఐ లాంచ్ చేసింది. ఛాట్‌జీపీటీ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 1.7 కోట్ల సార్లు డౌన్‌లోడ్ అయినట్లు కంపెనీ ప్రకటించింది. ఒక్కో వారానికి సగటున 5.3 లక్షల సార్లు ఈ యాప్‌ను యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు.
ఛాట్ జీపీటీ ఇటీవలే తన సెర్చింజన్‌ను అప్‌డేట్ చేసింది. ఈ వెర్షన్‌కు ఛాట్ జీపీటీ 4 అని పేరు పెట్టారు. ఇమేజ్ ఇన్‌పుట్‌ను కూడా ఇక నుంచి ఛాట్ జీపీటీ తీసుకోనుంది. ఇంతకు ముందు వెర్షన్లు కేవలం టెక్స్ట్ ఇన్‌పుట్ మాత్రమే తీసుకునేవి. అయితే ఇది కూడా పర్ఫెక్ట్ వెర్షన్ కాదని సీఈవో శామ్ ఆల్ట్‌మన్ అన్నారు.
యూజర్ ఫీడ్‌బ్యాక్‌కు కూడా ఓపెన్ ఆప్షన్‌ను ఇందులో అందించారు. అయితే సెప్టెంబర్ 2021 అడ్డంకి మాత్రం ఇంకా అలాగే ఉంది. 2021 సెప్టెంబర్‌కు ముందు జరిగిన సంఘటనలు మాత్రమే ఇందులో లోడ్ చేశారు. కొత్త వెర్షన్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఛాట్ జీపీటీని ఇప్పటికే కొన్ని కంపెనీల్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.
We expanded the ChatGPT iOS app to 30+ more countries today! Now serving users in Algeria, Argentina, Azerbaijan, Bolivia, Brazil, Canada, Chile, Costa Rica, Ecuador, Estonia, Ghana, India, Iraq, Israel, Japan, Jordan, Kazakhstan, Kuwait, Lebanon, Lithuania (🧵1/2)
— OpenAI (@OpenAI) May 25, 2023
Mauritania, Mauritius, Mexico, Morocco, Namibia, Nauru, Oman, Pakistan, Peru, Poland, Qatar, Slovenia, Tunisia and the United Arab Emirates (🧵2/2)
— OpenAI (@OpenAI) May 25, 2023
Read Also: ట్విట్టర్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ పొందిన మస్క్ ట్వీట్ - ఎంత రీచ్ వచ్చింది?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial