Pixel 7a India Launch: సూపర్ డూపర్ ఫీచర్లతో గూగుల్ Pixel 7a స్మార్ట్ ఫోన్, భారత్ లో లాంచింగ్ ఎప్పుడంటే?
టెక్ దిగ్గజం గూగుల్ Pixel 7a పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత్ లో విడుదల చేయబోతోంది. తాజాగా ఈ ఫోన్ లాంచింగ్ తేదీని గూగుల్ ఇండియా అనౌన్స్ చేసింది.
టెక్ దిగ్గజం గూగుల్ Pixel 7a పేరుతో స్మార్ట్ ఫోన్ ను దేశీయ మార్కెట్లోకి తీసుకురాబోతోంది. తాజాగా ఈ స్మార్ట్ ఇండియా లాంచింగ్ గురించి గూగుల్ ఇండియా కీలక ప్రకటన చేసింది. మే 11న భారత్ లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు గూగుల్ ఇండియా సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. మే 11న తన వార్షిక Google I/O కాన్ఫరెన్స్ లో Pixel 7aని ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ-కామర్స్ సైట్ Flipkartలో అమ్మకానికి అందుబాటులోకి రానుంది.
How to show excitement without shouting? Asking for a friend
— Google India (@GoogleIndia) May 2, 2023
Coming to @Flipkart on 11th May. pic.twitter.com/il6GUx3MmR
Google Pixel 7a స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు
Pixel 7a స్మార్ట్ ఫోన్ సరికొత్త కోరల్, ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. చార్ కోల్ బ్లాక్ వేరియంట్‌లో కూడా వచ్చే అవకాశం ఉంది. తాజాగా లీకైన Pixel 7a స్పెక్స్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఈ రంగులను ధృవీకరిస్తున్నాయి. ముందుగా చెప్పినట్లుగా, ఈ ఫోన్ గత సంవత్సరం విడుదలైన Google Pixel 6aకి సక్సెసర్‌గా ఉండబోతోంది. Pixel 6a స్మార్ట్ ఫోన్ తో పోల్చితే మరిన్నిప్రత్యేకతలను కలిగి ఉండనుంది.
Google Pixel 7a ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇలా ఉండవచ్చు!
సరికొత్త Google Pixel 7a ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో వచ్చే అవకాశం ఉంది. Pixel 6a కంటే అప్‌గ్రేడ్‌తో రానున్న Pixel 7aలో ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి Pixel 6aలో AI-ఆధారిత ఫేస్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ లేదు. కానీ, Pixel 7a ఆ ఫీచర్‌తో వచ్చే అవకాశం ఉంది. టిప్‌స్టర్ స్నూపీ టెక్ లీక్ ప్రకారం, పిక్సెల్ 7a స్మార్ట్ ఫోన్ ఫ్లాట్ డిస్ ప్లే, కొద్దిగా మందపాటి బెజెల్‌లను కలిగి ఉండవచ్చు. ఈ ఫోన్ OnePlus 11R, Samsung Galaxy S21 FE, OnePlus 10R స్మార్ట్ ఫోన్లకు వాటికి పోటీగా ఉంటుంది.
Google Pixel 7a 8GB LPDDR5 RAM, 128GB ఇన్ బిల్ట్ మెమరీతో రానుంది ఇంటర్నల్ టెన్సర్ G2 చిప్ ద్వారా శక్తిని పొందే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల పూర్తి-HD+ OLED స్క్రీన్‌ను కలిగి ఉండవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా 13MP అల్ట్రా-వైడ్ షూటర్‌తో 64 MP మెయిన్ సెన్సార్‌కి అప్‌గ్రేడ్ చేస్తోంది.
Google Pixel 7a ధర ఎంతంటే?
Google Pixel 7a ధర $499 (భారత్ కరెన్సీలో సుమారుగా రూ. 40,970)గా ఉండవచ్చని తెలుస్తోంది. గత సంవత్సరం విడుదలైన Pixel 6a కంటే $50 (సుమారు రూ.4100) ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే Pixel 7a ధరలు అమెరికాతో పోల్చితే భారత్ లో భిన్నంగా ఉండనున్నాయి.
Read Also: స్మార్ట్ ఫోన్ కొనాలా? సమ్మర్ సేల్‌లో ఏ ఫోన్‌కు ఎంత ఆఫర్ ఉందే ఇప్పుడే చూసేయండి!