By: ABP Desam | Updated at : 04 Mar 2022 07:20 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
ఒప్పో రెనో 7జెడ్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. (Image Credits: Oppo)
Oppo Reno 7Z 5G: ఒప్పో రెనో 7జెడ్ 5జీ స్మార్ట్ ఫోన్ థాయ్‌ల్యాండ్‌లో లాంచ్ అయింది. ఒప్పో రెనో 7 లైనప్‌లో ఇది కొత్తగా చేరింది. ఇప్పటివరకు ఒప్పో రెనో 7 5జీ, ఒప్పో రెనో 7 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్లు ఈ సిరీస్‌లో లాంచ్ అయ్యాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఈ ఫోన్‌లో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గానూ ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉండగా... సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
ఈ స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఒప్పో థాయ్‌ల్యాండ్ ట్వీట్ ప్రకారం... దీని ధర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. కంపెనీ వెబ్ సైట్ ప్రకారం... ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. కాస్మిక్ బ్లాక్, రెయిన్‌బో స్పెక్ట్రం రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఒప్పో రెనో 7జెడ్ 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గానూ ఉండనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 33W సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని మందం 0.75 సెంటీమీటర్లు కాగా... బరువు 173 గ్రాములుగా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ ఓటీజీ కూడా ఇందులో అందించారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, మ్యాగ్నటిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఆప్టికల్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్, పీడోమీటర్, జీపీఎస్, గ్లోనాస్ వంటి సెన్సార్లు, ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
Realme Pad X: రూ.15 వేలలోనే రియల్‌మీ ట్యాబ్లెట్ - భారీ డిస్ప్లే, పెద్ద బ్యాటరీ - ఎలా ఉందో చూశారా?
iPhone 14 Series: ఐఫోన్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్ - చైనా మళ్లీ ముంచేసిందిగా!
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Whatsapp End Support: ఈ ఫోన్లకు వాట్సాప్ ఇక పనిచేయదు - అధికారికంగా తెలిపిన మెటా - మీ మొబైల్స్ ఉన్నాయేమో చూసుకోండి!
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!
Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు