OnePlus 11R 5G: వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ డిస్కౌంట్ - ఇప్పుడు ఎంతకు వస్తుందంటే?
OnePlus 11R 5G Offer: వన్‌ప్లస్ 11ఆర్ 5జీ స్మార్ట్ ఫోన్‌పై మనదేశంలో రూ.నాలుగు వేల వరకు తగ్గింపును అందించారు.
OnePlus 11R 5G Price Drop: వన్‌ప్లస్ 11ఆర్ 5జీ (OnePlus 11R 5G) స్మార్ట్ ఫోన్ మనదేశంలో గతేడాది ఫిబ్రవరిలో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన మిడ్ రేంజ్ ప్రీమియం 5జీ ఫోన్ ఇది. వన్‌ప్లస్ ప్రస్తుతం ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తుంది. దీంతోపాటు బ్యాంక్ ఆఫర్ల ద్వారా ధర మరింత తగ్గనుంది. కంపెనీ అందించే డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లు కాకుండా అదనంగా ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ కూడా లభించనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై వన్‌ప్లస్ 11ఆర్ పని చేయనుంది. 100W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
వన్‌ప్లస్ 11ఆర్ 5జీ స్మార్ట్ ఫోన్ ప్రస్తుత ధర
వన్‌ప్లస్ 11ఆర్ 5జీ స్మార్ట్ ఫోన్ ధరను మనదేశంలో రూ.3,000 వరకు తగ్గించారు. ఇందులో 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.44,999 కాగా ప్రస్తుతం రూ.41,999కు తగ్గింది. ఇక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.39,999 కాగా ఇప్పుడు రూ.37,999కు తగ్గింది.
ఈ రెండు వేరియంట్లూ డిస్కౌంట్ ధరకే అమెజాన్, వన్‌ప్లస్ అధికారిక సైట్లలో అందుబాటులో ఉన్నాయి. ఐసీఐసీఐ, వన్ బ్యాంకు క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 అదనపు తగ్గింపు లభించనుంది. అంటే మొత్తంగా రూ.4,000 వరకు తగ్గింపును కంపెనీలు అందించనున్నారన్న మాట. అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,500 వరకు వెల్‌కమ్ రివార్డ్స్ కూడా అందించనున్నారు. నెలవారీ ఈఎంఐ రూ.4,334 నుంచి ప్రారంభం కానుంది.
వన్‌ప్లస్ 11ఆర్ 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ 11ఆర్ 5జీ పని చేయనుంది. ఇందులో 6.74 అంగుళాల కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇది 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయనుంది. సెల్ఫీ కెమెరా కోసం హోల్ పంచ్ కటౌట్ చూడవచ్చు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 16 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్890 సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా ఈ ఫోన్ అన్‌లాక్ అవుతుంది. వన్‌ప్లస్ 11ఆర్ 5జీ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 100W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?