By: ABP Desam | Updated at : 26 Jan 2022 05:27 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
వన్‌ప్లస్ 10 అల్ట్రా స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.
వన్‌ప్లస్ 10 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉందని లీకులు వస్తున్నాయి. ఈ వన్‌ప్లస్ అల్ట్రా స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఈ సంవత్సరం రెండో భాగంలో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ మధ్యే లాంచ్ అయిన వన్‌ప్లస్ 10 ప్రో కంటే టాప్ స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. దీంతోపాటు త్వరలో రానున్న ఈ కొత్త స్మార్ట్ ఫోన్లలో హాజిల్‌బ్లాడ్ కెమెరాలను అందించనున్నట్లు సమాచారం.
షియోమీ అల్ట్రా సిరీస్‌కు పోటీగా వన్‌ప్లస్ దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని అనుకోవచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఇంజనీరింగ్ వెరిఫికేషన్ టెస్టులు జరుగుతున్నాయని సమాచారం. ఒక్కసారి ఈ టెస్టులు పూర్తయితే.. ఆ తర్వాత అధికారిక ప్రకటన, లాంచ్ అన్ని చకచకా అయిపోతాయి.
నిజానికి ఈ ఇంజనీరింగ్ వెరిఫికేషన్ టెస్టులు స్మార్ట్ ఫోన్ల ప్రోటోటైప్‌లపై చేస్తారు. డివైస్‌లకు మొదటి దశల్లో జరిగే టెస్టుల్లో ఇది కూడా ఒకటి. దీని తర్వాత డిజైన్ వెరిఫికేషన్ టెస్టింగ్ (డీవీటీ), ప్రొడక్ట్ వెరిఫికేషన్ టెస్టింగ్ (పీవీటీ) జరగనున్నాయి.
ఒప్పో, వన్‌ప్లస్ భాగస్వామ్యం గురించి కూడా ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఒప్పో ఫైండ్ ఎక్స్5 సిరీస్ స్మార్ట్ ఫోన్లలో కూడా హాజిల్ బ్లాడ్ కెమెరాలు అందిస్తారని తెలుస్తోంది. అలాగే ఒప్పో మారిసిలికాన్ ఎక్స్ ఎన్‌పీయూని వన్‌ప్లస్ ఫ్లాగ్ షిప్ డివైస్‌ల్లో అందించనున్నట్లు తెలుస్తోంది. 2022 ద్వితీయార్థంలో ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుందని తెలుస్తోంది.
ఒప్పో మారిసిలికాన్ ఎక్స్ అనేది ఒక న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది ఫొటోలు, వీడియోలను మెరుగు పరుస్తుందని కంపెనీ అంటోంది. టీఎస్ఎంసీ 6 నానోమీటర్ టెక్నాలజీతో దీన్ని రూపొందించినట్లు కంపెనీ అంటోంది. ఒప్పో ఫైండ్ ఎక్స్ సిరీస్ ఫోన్లతోనే ఈ టెక్నాలజీ కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది.
OnePlus might launch the OnePlus 10 Ultra in 2nd half of 2022!
— OnePlus Club (@OnePlusClub) January 25, 2022
Concept design by Jason#OnePlus10Pro #OnePlus10Ultra pic.twitter.com/GnC7ynXue7
OnePlus Nord 2T Expected
— Rock Leaks (@rockleaks) January 26, 2022
Specifications.
6.43" FHD+ 90Hz AMOLED
MediaTek Dimensity 1300
50+8+2MP
32MP Front
4500mAh
80W Fast charging
Android 12 (OxygenOS 12)
6/8+128/256GB
Via:@OnLeaks #oneplus #OnePlus10Pro #OnePlus9RT5G #OnePlus10Ultra #OnePlus10 #OnePlusNord2T https://t.co/jHNispdfBD pic.twitter.com/nMGFDXUic7
Also Read: iPhone 15 Series: ఐఫోన్లలో మొదటిసారి ఆ కెమెరాలు.. ఎప్పుడు రానున్నాయంటే?Also Read: Realme 9i: రూ.14 వేలలోపే రియల్మీ కొత్త ఫోన్.. సూపర్ అనిపించే ఫీచర్లు.. లేటెస్ట్ ప్రాసెసర్ కూడా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Whatsapp End Support: ఈ ఫోన్లకు వాట్సాప్ ఇక పనిచేయదు - అధికారికంగా తెలిపిన మెటా - మీ మొబైల్స్ ఉన్నాయేమో చూసుకోండి!
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Jio Free Data: ఉచితంగా డేటా, కాల్స్ అందిస్తున్న జియో - ఎవరికంటే?
Realme New Tablet: రియల్మీ కింగ్ ఆఫ్ ట్యాబ్లెట్స్ వచ్చేది అప్పుడే - ఫీచర్లు కూడా లీక్!
PM Modi Hyderabad Tour: కేసీఆర్పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు
Simha Koduri As USTAAD: రాజమౌళి ఫ్యామిలీలో యంగ్ హీరో కొత్త సినిమాకు 'ఉస్తాద్' టైటిల్ ఖరారు
Vikram Movie Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో కమల్ హాసన్ 'విక్రమ్' ఎన్ని థియేటర్లలో విడుదల అవుతోందంటే?