అన్వేషించండి

OnePlus 10 Pro: వన్‌ప్లస్ 10 ప్రో వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లతో - ఎలా ఉందో తెలుసా?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ అయింది. దీని ధరను రూ.66,999గా నిర్ణయించారు.

వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్22, ఐఫోన్ 13 స్మార్ట్ ఫోన్లతో వన్‌ప్లస్ 10 ప్రో పోటీ పడనుంది.

వన్‌ప్లస్ 10 ప్రో ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.66,999గా నిర్ణయించారు. ఇక 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.71,999గా ఉంది. ఎమరాల్డ్ ఫారెస్ట్, వొల్కానిక్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఏప్రిల్ ఐదో తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది.

వన్‌ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ 10 ప్రో పనిచేయనుంది.  ఇందులో 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ+ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఎల్టీపీవో టెక్నాలజీని ఇది సపోర్ట్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20.1:9గా ఉంది. డైనమిక్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్‌ను కంపెనీ ఇందులో అందించింది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్యానెల్‌ను కూడా ఇందులో ఉంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో అందించారు.

క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్789 సెన్సార్‌ను వన్‌ప్లస్ అందించింది. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ జేఎన్1 సెన్సార్‌ను అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌గానూ, 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను టెలిఫొటో షూటర్‌గానూ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్615 కెమెరా ఇందులో ఉంది.

వన్‌ప్లస్ 10 ప్రోలో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. 5000 ఎంఏహెచ్ డ్యూయల్ సెల్ బ్యాటరీని ఇందులో అందించారు. 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌ను, 50W వైర్‌లెస్ చార్జింగ్‌ను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఇందులో స్టీరియో స్పీకర్లు అందించారు. డాల్బీ అట్మాస్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.85 సెంటీమీటర్లుగానూ, బరువు 200.5 గ్రాములుగానూ ఉంది.

Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?

Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Southwest Monsoon Update: నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
Bandla Ganesh : బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
TMC crisis 2026: మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
AP PCC Chief Sharmila : వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం
వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southwest Monsoon Update: నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
Bandla Ganesh : బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
TMC crisis 2026: మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
AP PCC Chief Sharmila : వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం
వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం
Heatwave In AP and Telangana: వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
Bihar police frisked by boy: బీహార్‌లో గ్యాంగ్ స్టర్ ఇంట్లో సోదాలకు పోలీసులు ఎలా వెళ్తారో తెలుసా? - ఈ వీడియో చూస్తే సినిమాల్లో చూపించేది తక్కువే అనుకుంటారు!
బీహార్‌లో గ్యాంగ్ స్టర్ ఇంట్లో సోదాలకు పోలీసులు ఎలా వెళ్తారో తెలుసా? - ఈ వీడియో చూస్తే సినిమాల్లో చూపించేది తక్కువే అనుకుంటారు!
TVK Vijay: ఫిరాయింపుల రాజకీయాలతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ - మార్పు నమ్మకాన్ని తమిళ ప్రజలు కోల్పోయినట్లేనా?
ఫిరాయింపుల రాజకీయాలతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ - మార్పు నమ్మకాన్ని తమిళ ప్రజలు కోల్పోయినట్లేనా?
2026 TVS Jupiter 125 Colors: టీవీఎస్ జూపిటర్ 125 నుంచి అదిరిపోయే అప్‌డేట్‌! ఆకట్టుకునే ఫీచర్స్‌తోపాటు కలర్‌ఫుల్ రంగుల్లో మార్కెట్‌లోకి... 
టీవీఎస్ జూపిటర్ 125 నుంచి అదిరిపోయే అప్‌డేట్‌! ఆకట్టుకునే ఫీచర్స్‌తోపాటు కలర్‌ఫుల్ రంగుల్లో మార్కెట్‌లోకి... 
Embed widget