అన్వేషించండి

NASA: మూత్రం, చెమటను వేస్ట్ చేయకుండా తాగేయొచ్చు - నాసా సరికొత్త టెక్నాలజీతో అక్కడి నీటి కష్టాలకు చెక్!

అంతరిక్ష పరిశోధనలో నాసా మరో ఘనత సాధించింది. స్పేస్ స్టేషన్ లో ఉండే వ్యోమగాములకు నీటి కష్టాలు రాకుండా సరికొత్త ఆవిష్కరణ చేసింది. వ్యోమగాముల చెమట, మూత్రం నుంచి స్వచ్ఛమైన నీటిని తయారు చేసింది.

మానవ జీవితానికి అతి ముఖ్యమైనవి పీల్చే గాలి, తాగే నీరు. ఈ రెండు లేకపోతే మానవ మనుగడ లేదని చెప్పుకోవచ్చు. భూమ్మీద మనుషులకు కావాల్సినంత గాలి, తాగేందుకు నీరు పుష్కలంగా లభిస్తుంది. పరిశోధనల కోసం అంతరిక్షకేంద్రానికి వెళ్లే వ్యోమగాములకు మాత్రం అక్కడ నీరు, గాలి అస్సలే దొరకదు. అందుకే, భూమి మీది నుంచే కావాల్సినంత నీరు, ఆక్సీజన్ ను మోసుకెళ్తారు. అప్పుడప్పుడు కార్గో స్పేస్‌ క్రాఫ్ట్ ద్వారా వీటిని అంతరిక్ష కేంద్రానికి పంపిస్తారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉండే సిబ్బంది అవసరాల కోసం రోజుకు గాలన్ నీరు కావాలి. రెండు సంవత్సరాల పాటు కొనసాగే మార్స్‌ మిషన్ లాంటి అంతరిక్ష యాత్రలకు నీటి అవసరం ఇంకా ఎక్కువే ఉంటుంది.

అంతరిక్ష కేంద్రంలో నీటి కష్టాలు తీరినట్లేనా?

అంతరిక్ష కేంద్రంలో నీటి సమస్యను పరిష్కరించేందుకు చాలా కాలంగా శాస్త్రవేత్తలు, వ్యోమగాములు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సొంతంగా  అక్కడే స్వచ్ఛమైన నీటిని ఉత్పత్తి చేసుకోవడంతో పాటు ఆహారాన్ని పొందేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ దిశగా తొలి అడుగు వేసింది నాసా. పర్యావరణ నియంత్రణ, లైఫ్ సపోర్టు సిస్టమ్(ECLSS)ను డెవలప్ చేస్తోంది. ఇది ఆహారం, గాలి, నీరు లాంటి వినియోగ వస్తువులను రీసైకిలింగ్ చేస్తుంది. వాస్తవానికి చాలా కాలం కొనసాగే అంతరిక్ష పరిశోధన కోసం వెళ్లే వ్యోమగాములు, సిబ్బంది తీసుకెళ్లే నీరు కచ్చితంగా 98 శాతం వరకు పునరుద్దరణ జరగాలి. ఇటీవల, ECLSS ఆ లక్ష్యాన్ని సాధించగలదని నిరూపించింది. నీటి రీసైక్లింగ్ లో కీలక మైలు రాయిని దాటింది.   

అంతరిక్ష కేంద్రంలో నీటిని ఎలా తయారు చేశారంటే?

అంతరిక్ష కేంద్రంలో  ECLSS పద్దతి ద్వారా సురక్షితమైన నీటిని తయారు చేస్తున్నారు పరిశోధకులు. ఇందులో వాటర్ రికవరీ సిస్టమ్ ముందుగా మురుగు నీటిని సేకరిస్తుంది. స్పేస్ స్టేషన్ లోని స్టాఫ్ శ్వాస, చెమట నుంచి క్యాబిన్ గాలిలోకి విడుదలయ్యే తేమను సంగ్రహించే అధునాతన డీహ్యూమిడిఫైయర్‌లను కలిగి ఉంటుంది. ఇది సేకరించిన నీటిని తాగేందుకు అనుకూలమైనదిగా మార్చేవాటర్ ప్రాసెసర్ అసెంబ్లీ (WPA)కి పంపబడుతుంది. అటు యూరిన్ ప్రాసెసర్ అసెంబ్లీ (UPA) వాక్యూమ్ డిస్టిలేషన్ ఉపయోగించి మూత్రం నుండి నీటిని తిరిగి పొందేలా చేస్తుంది.  బ్రైన్ ప్రాసెసర్ అసెంబ్లీ (BPA) మిగిలిన మురుగునీటిని వెలికితీసేందుకు UPAకి జోడించబడింది. BPA ప్రత్యేక మెమ్బ్రేన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది.  నీటిని ఆవిరి చేయడానికి ఉప్పునీరుపై వెచ్చని, పొడి గాలి వీచేలా చేస్తుంది. ఆ ప్రక్రియ తేమతో కూడిన గాలిని తయారు చేస్తుంది. ఈ ప్రక్రియలో స్వచ్ఛమైన తాగు నీరు లభిస్తుంది. ఈ వ్యవస్థ సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడానికి నీటిలో అయోడిన్‌ను యాడ్ చేస్తుంది. ఆ తర్వాత ఈ నీరు తాగేందుకు అనుకూలంగా మారుతుంది. మొత్తంగా BPA వ్యవస్థ 98% నీటి పునరుద్ధరణ లక్ష్యాన్ని సాధించడంలో  కీలక పాత్ర పోషించింది.  

నీటి తయారీలో పురోగతి పట్ల పరిశోధకుల హర్షం

అంతరిక్ష కేంద్రంలో నీటి తయారీలో అనుకున్న లక్ష్యాన్ని సాధించడం పట్ల ECLSS నీటి నిర్వాహకుడు జిల్ విలియమ్సన్ సంతోషం వ్యక్తం చేశారు. "ఇక్కడ నీటి ప్రాసెసింగ్ ప్రాథమికంగా కొన్ని భూసంబంధమైన నీటి శుద్ధి వ్యవస్థలను పోలి ఉంటుంది. మైక్రోగ్రావిటీ ద్వారానే నీరు స్వచ్ఛంగా మార్చబడుతుంది. ఇక్కడి సిబ్బంది మూత్రం ద్వారా వచ్చిన నీటిని తాగుతున్నారు అనుకోవద్దు. ఈ నీరు భూమి మీద మనం తాగే దానికంటే పరిశుభ్రంగా ఉండేలా, శుద్ధి చేయబడుతుంది. అత్యంత పరిశుభ్రమైన నీటిని తాగుతున్నారు. తాగు నీటి ఉత్పత్తిలో సక్సెస్ అయినట్లే మేం భావిస్తున్నాం” అని తెలిపారు.    

Read Also: డేటింగ్ కోసం తగిన జోడీ కావాలా? మీకెందుకు అంత శ్రమ, AI వెతికి పెడుతుంది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Embed widget