ZTE Axon 40 SE: జెడ్‌టీఈ కొత్త ఫోన్ లాంచ్ - రియల్‌మీ, రెడ్‌మీ ఫోన్లతో పోటీ!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ జెడ్‌టీఈ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే జెడ్‌టీఈ యాక్సాన్ 40 ఎస్ఈ.
జెడ్‌టీఈ యాక్సాన్ 40 ఎస్ఈ స్మార్ట్ ఫోన్ మెక్సికోలో లాంచ్ అయింది. హోల్ పంచ్ డిస్‌ప్లేను అందించారు. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఈ ఫోన్‌లో ఉంది. ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అయితే 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్న రెడ్‌మీ 10 సిరీస్, రియల్‌మీ సీ-సిరీస్ ఫోన్లతో పోటీ పడనుంది.
జెడ్‌టీఈ యాక్సాన్ 40 ఎస్ఈ ధర
ఈ ఫోన్ ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే గిజ్మోచైనా కథనం ప్రకారం 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,999 మెక్సికన్ పెసోలుగా (సుమారు రూ.24,700) ఉంది. బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ గ్లోబల్‌గా ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియరాలేదు.
జెడ్‌టీఈ యాక్సాన్ 40 ఎస్ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై జెడ్‌టీఈ యాక్సాన్ 40 ఎస్ఈ పని చేయనుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. యూనిసోక్ టీ618 ప్రాసెసర్ ఈ ఫోన్‌లో ఉంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అందించారు. ర్యామ్‌ను ఉపయోగించని స్టోరేజ్ నుంచి 2 జీబీ పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 5 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. యాక్సెలరోమీటర్, కంపాస్, లైట్ సెన్సార్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్లు అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 22.5W ఫాస్ట్ చార్జింగ్‌ను జెడ్‌టీఈ యాక్సాన్ 40 ఎస్ఈ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.76 సెంటీమీటర్లుగా ఉంది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
View this post on Instagram
View this post on Instagram