అన్వేషించండి

WhatsApp Alert : ఈ ఫోన్ మోడల్స్‌లో వాట్సాప్ బంద్ - ఆ జాబితాలో మీ ఫోనుందేమో చెక్ చేసుకోండి !

యూజర్ల ప్రైవసీని గండంలోకి నెట్టే ఓఎస్‌లతో నడుస్తున్న ఫోన్లకు సర్వీస్ నిలిపివేయాలని వాట్సాప్ నిర్ణయించింది. మార్చి 31వ తేదీ నుంచి వాట్సాప్ ఆ ఫోన్లలో ఆగిపోతుంది. అవి ఏ మోడల్స్ అంటే..?

మార్చి31వ తేదీ నుంచి వాట్సాప్ కొన్ని మోడల్స్ ఫోన్లలో పని చేయడం ఆగిపోతుంది. యూజర్ల ప్రైవసీని కాపాడేందుకు ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లు తీసుకు వస్తోంది వాట్సాప్. ఈ క్రమంలో పాత ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్న మొబైల్ ఫోన్లలో వాట్సాప్ సపోర్ట్ చేయడం లేదు. వాటి వల్ల వాట్సాప్ యూజర్ల ప్రైవసీకి భంగం కలుగుతుందని నిర్ణయానికి రావడంతో అలాంటి ఓఎస్‌లు ఉన్న ఫోన్లలో వాట్సాప్‌ను పని చేయకుండా చేయాలని నిర్ణయించుకున్నారు. యాప్ సేవలను నిలిపివేస్తుంటుంది. ఇందులో భాగంగా మార్చి 31 నుంచి కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌లో సేవలను నిలిపివేస్తామని వాట్సాప్ ప్రకటించింది.  

అండ్రాయిడ్ ఫోన్లలో ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్లు వస్తున్నాయి.  ఆండ్రాయిడ్ వెర్షన్ 4.1 వచ్చి ఏళ్లు గడిచిపోయింది. ఈ వెర్షన్ ఓఎస్ దాదాపుగా ఏ ఫోన్లోనూ ఉండటం లేదు. అయితే అప్ డేట్ లేకుండా ఆ ఓఎస్ తో ఫోన్లు వాడుతున్నవారు ఉన్నారు. ఇక వారికి వాట్సాప్ సేవలు అందవు.  ఆండ్రాయిడ్ వెర్షన్ 4.1 కన్నా ఎక్కువ వెర్షన్ ఓఎస్ ఉన్న వారికి మాత్రం వాట్సాప్ సేవల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు.  అలాగే యాపిల్ ఐ ఫోన్లలో  iOS 2.5 లేదా అంతకన్నా హయ్యర్ వెర్షన్‌లలో మాత్రమే వాట్సాప్ పని చేస్తుంది.  ఆండ్రాయిడ్ వెర్షన్ 4.1 కన్నా ఓల్డర్ వెర్షన్లు, ఐఫోన్ 9 లేదా అంతకన్నా ఓల్డర్ వెర్షన్లు, KaiOS 2.4 లేదా అంతకంటే ఓల్డర్ వెర్షన్లలో వాట్సాప్ పనిచేయదు.  

 ఫోన్ మోడళ్ల వారీగా చూసుకుంటే షియోమీ కంపెనీకి చెందిన  HongMi, Mi2a, Mi2s, రెడ్ మి నోట్ 4జీ, HongMi 1s మోడల్స్‌లో వాట్సాప్ పనిచేయదు. ఇక ఎల్‌జీ ఫోన్లలో అయితే ఆప్టిమస్‌ F7, ఆప్టిమస్‌ L3 II డ్యూయల్, ఆప్టిమస్‌ F5, ఆప్టిమస్‌ L5 II, ఆప్టిమస్‌ L5 II Dual, ఆప్టిమస్‌ L3 II, ఆప్టిమస్‌ L7 II డ్యూయల్, ఆప్టిమస్‌ L7 II, ఆప్టిమస్‌ F6, ఎల్‌జీ ఎనాక్ట్, ఆప్టిమస్‌ L4 II డ్యూయల్, ఆప్టిమస్‌ F3, ఆప్టిమస్‌ L4 II , ఆప్టిమస్‌ L2 II, ఆప్టిమస్‌ F3Q....మోటరోలా బ్రాండ్‌లో  మోటారోలా డ్రాయిడ్ రేజర్ ,  హువావే బ్రాండ్ కు చెందిన  హువావే అసెండ్‌ D, క్వాడ్ XL, అసెండ్‌ D1, క్వాడ్ XL, అసెండ్‌ P1 S,  ... శామ్‌సంగ్‌ గెలాక్సీ ట్రెండ్ లైట్, గెలాక్సీ S3 మినీ, గెలాక్సీ Xcover 2, గెలాక్సీ కోర్ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు.  వాడుకలో లేని పాత ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో మాత్రమే వాట్సాప్ సేవలు ఆగిపోతున్నాయి.

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget