అన్వేషించండి

Vivo Y21G India Launch: వివో కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది - రూ.15 వేలలోపే - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూడండి!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త స్మార్ట్ ఫోన్ వై21జీని మనదేశంలో లాంచ్ చేసింది. దీని ధర రూ.13,990గా ఉంది.

వివో వై21జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇది వివో వై-సిరీస్‌లో లాంచ్ అయింది. ఇందులో 4 జీబీ ర్యామ్ ఉంది. ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్‌ను కూడా ఇందులో అందించారు. ఇందులో 6.51 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇందులో ఉంది.

వివో వై21జీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.13,990గా నిర్ణయించారు. డైమండ్ గ్లో, మిడ్‌నైట్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన ఆఫ్ లైన్ సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఆన్‌లైన్ సేల్ త్వరలో ప్రారంభం కావాల్సి ఉంది.

వివో వై21జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.51 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. 4 జీబీ ర్యామ్‌ను ఇందులో అందించారు. ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను మరో 1 జీబీ పెంచుకోవచ్చు.

64 జీబీ స్టోరేజ్‌ను కూడా వివో ఇందులో అందించింది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. మీడియాటెక్ ఎంటీ6769 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని మందం 0.8 సెంటీమీటర్లు కాగా... బరువు 182 గ్రాములుగా ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ అపెర్చర్ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

4జీ, వైఫై, బ్లూటూత్ వీ5, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లను ఇందులో అందించారు. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్ సెన్సార్లు ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?

Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gold and Silver in Your Phone: మీ ఫోన్‌లో బంగారం, వెండి నిధి ఉంది! మీ ఫోన్‌లోని ఏ భాగంలో ఏ లోహం ఉందో తెలుసా?
మీ ఫోన్‌లో బంగారం, వెండి ఉంది! మీ ఫోన్‌లోని ఏ భాగంలో ఏ లోహం ఉందో తెలుసా?
SIM Card Gold: ఫోన్‌లో బంగారం ఉంటుంది తెలుసా? ఎందుకు వాడతారు? దాని విలువ ఎంత?
ఫోన్‌లో బంగారం ఉంటుంది తెలుసా? ఎందుకు వాడతారు? దాని విలువ ఎంత?
iphone 16 Pro Price Drop: ఐఫోన్ 16 ప్రోపై డిస్కౌంట్.. 15,000 కంటే ఎక్కువ బెనిఫిట్స్ మీ సొంతం
ఐఫోన్ 16 ప్రోపై డిస్కౌంట్.. 15,000 కంటే ఎక్కువ బెనిఫిట్స్ మీ సొంతం
iPhone 17e Launched: 48 MP కెమెరా, శాటిలైట్ ఫీచర్లతో వచ్చిన iPhone 17e.. ధర, పూర్తి వివరాలు
48 MP కెమెరా, శాటిలైట్ ఫీచర్లతో వచ్చిన iPhone 17e.. ధర, పూర్తి వివరాలు

వీడియోలు

Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Ishan Kishan Family Tragedy T20WC | ఇషాన్ కిషన్ కన్నీటి గాథ
Abhishek Records with Dube's Bat | అభిషేక్ విధ్వంసం వెనుక అసలు రహస్యం ఇదే
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Iran War Updates: గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
Praneeth Antilia controversy: గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
West Bengal CM Mamata Banerjee: ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
Americans Migrating Abroad:
"అమెరికాలో ఉండలేం" అగ్రరాజ్యాన్ని వదిలి వలస వెళ్లిపోతున్న అమెరికన్లు!
IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! ఇందులో ఒక ట్విస్ట్ ఉంది!
ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! ఇందులో ఒక ట్విస్ట్ ఉంది!
Reliance Industries: దేశ ఇంధన భద్రతకు రిలయన్స్‌ భరోసా! జామ్‌నగర్‌లో రికార్డు స్థాయిలో ఎల్పీజీ ఉత్పత్తి! కేజీ డీ 6 గ్యాస్ సరఫరాలో కీలక మార్పులు!
దేశ ఇంధన భద్రతకు రిలయన్స్‌ భరోసా! జామ్‌నగర్‌లో రికార్డు స్థాయిలో ఎల్పీజీ ఉత్పత్తి! కేజీ డీ 6 గ్యాస్ సరఫరాలో కీలక మార్పులు!
Tata Tiago Vs Maruti WagonR: టాటా టియాగో, మారుతి వ్యాగన్ఆర్ ఏ బేస్ మోడల్ కొనడం మంచిది? తేడా తెలుసుకోండి!
టాటా టియాగో, మారుతి వ్యాగన్ఆర్ ఏ బేస్ మోడల్ కొనడం మంచిది? తేడా తెలుసుకోండి!
Embed widget