By: ABP Desam | Updated at : 16 Jul 2022 11:28 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
వివో టీ1ఎక్స్ 5జీ
వివో టీ1ఎక్స్ మనదేశంలో జులై 19వ తేదీన లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ వివో ఫోన్ చైనాలో గతేడాది లాంచ్ అయింది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
వివో టీ1ఎక్స్ ధర (అంచనా)
చైనాలో ఈ ఫోన్ 1,699 యువాన్ల (సుమారు రూ.20,000) ధరతో లాంచ్ అయింది. మనదేశంలో కూడా దీని ధర ఆ రేంజ్‌లోనే ఉండే అవకాశం ఉంది. అయితే అధికారికంగా ఎంత ఉండనుందో తెలియాలంటే మాత్రం లాంచ్ అయ్యే దాకా వెయిట్ చేయాల్సిందే.
వివో టీ1ఎక్స్ స్పెసిఫికేషన్లు (అంచనా)
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంపై వివో టీ1ఎక్స్ పనిచేయనుంది. ఇందులో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్క భాగంలో అందించారు.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
Amazon Vs Flipkart: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో ఏ కార్డులపై ఆఫర్లు ఉన్నాయి? - వీటి ద్వారా మరింత తగ్గనున్న ధరలు!
Big Billion Days Sale 2023: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - టాప్-10 డీల్స్ ఇవే!
Vivo Price Cut: రెండు ఫోన్ల ధరలు తగ్గించిన వివో - ఇప్పుడు రూ.12 వేల లోపుకే!
Itel P55: దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.10 వేలలోపే 8 జీబీ + 128 జీబీ - ఐటెల్ పీ55 వచ్చేసింది!
Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే
Nara Lokesh: టీడీపీ ఎంపీలతో నారా లోకేష్ అత్యవసర భేటీ, నోటీసులపై చర్చ
Lyca Productions: మలయాళంలో లైకా ప్రొడక్షన్స్ ఎంట్రీ - బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో
Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా
/body>