By: ABP Desam | Updated at : 05 May 2022 01:36 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
వివో టీ1 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. (Image Credits: Vivo)
వివో టీ1 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో గురువారం లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌ను అందించారు. వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వివో టీ1 ప్రో 5జీలో 6.44 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండటం విశేషం. మనదేశంలో గత నెలలో లాంచ్ అయిన ఐకూ జెడ్6 ప్రో 5జీకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది.
వివో టీ1 ప్రో 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.23,999గా నిర్ణయించారు. టాప్ ఎండ్ మోడల్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. టర్బో బ్లాస్, టర్బో సియాన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌కి సంబంధించిన ప్రీ-బుకింగ్స్ మే 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మే 7వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌పై రూ.2,500 వరకు బ్యాంక్ ఆఫర్లు అందించనున్నారు. అంటే రూ.20,499కే దీన్ని కొనుగోలు చేయవచ్చన్న మాట.
వివో టీ1 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై వివో టీ1 ప్రో పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా... టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గా ఉంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అందించారు. ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ద్వారా మరో 4 జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు.
వివో టీ1 ప్రో 5జీ బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్‌గా ఉంది. 66W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా... బరువు 180.3 గ్రాములుగా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు సెన్సార్లు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందించారు. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా వివో టీ1 ప్రో 5జీలో ఉన్నాయి.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
Smartphone Hacking Signs: మీ ఫోన్ ఇలా ప్రవర్తిస్తుందా? - అయితే హ్యాక్ అయినట్లే - రీసెట్ చేయాల్సిందే!
Smartphone Charging Tips: ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? - పేలిపోయే అవకాశం ఉంది జాగ్రత్త!
Upcoming Smartphones: డిసెంబర్ మొదటి వారంలో ఏకంగా ఐదు ఫోన్లు లాంచ్ - ఏమేం వస్తున్నాయి? - వీటి కోసం వెయిట్ చేయవచ్చా?
Most Secured Smartphone: ప్రపంచంలో అత్యంత సెక్యూర్డ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - ఒక్కదాని పేరైనా మీరు విన్నారా?
Meizu 21: 200 మెగాపిక్సెల్ కెమెరా, లేటెస్ట్ ప్రాసెసర్‌తో గేమింగ్ ఫోన్ - ధర ఎంతంటే?
Revanth Team: రేవంత్‌తోపాటు ప్రమాణం చేసేది ఎవరు? ఇంకా వీడని సస్పెన్స్
Revanth Reddy First Signature: ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత రేవంత్ పెట్టే తొలి సంతకం ఇదే
Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?
Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
/body>