అన్వేషించండి

Smartphone Price Hike Reasons: 2025 నుంచి పెరగనున్న స్మార్ట్ ఫోన్ల ధరలు - ఈ మూడే కారణాలు!

Smartphone Price Hike: 2025లో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల ధరలు బాగా పెరగనున్నాయని వార్తలు వస్తున్నాయి. అన్ని కంపెనీలు ఏఐ కోసం పని చేస్తుండటంతో ఆ టెక్నాలజీపై ఎక్కువ ఖర్చు అవుతుందట.

Smartphone Price Hike in 2025: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. రోజుకో కొత్త కంపెనీ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌లోకి విడుదల చేస్తుంది. అయితే 2025 సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్లు మరింత ఖరీదైనవిగా మారవచ్చు. దీని వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు.

ఆ మూడు కారణాలూ ఇవే...
వీటిలో మొదటిది మంచి కాంపోనెంట్‌ల ధర పెరగడం. స్మార్ట్ ఫోన్ తయారీకి డిస్‌ప్లే, బ్యాటరీ, ప్రాసెసర్... వంటి విడి భాగాలు చాలా ముఖ్యం. వీటి ధర ప్రస్తుతం పెరుగుతోంది. దీని కారణంగా స్మార్ట్ ఫోన్ల ధర కూడా పెరగనుంది.

రెండోది 5జీ నెట్‌వర్క్ రాక కారణంగా ఖర్చు పెరగడం. మూడోది ఏఐ లాంటి కొత్త టెక్నాలజీ వినియోగం పెరగడం. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం స్మార్ట్‌ఫోన్ల సగటు ధర 2024 సంవత్సరంలో మూడు శాతం, 2025లో ఐదు శాతం పెరగనుంది. ప్రజలు ఇప్పుడు మరింత శక్తివంతమైన ప్రాసెసర్లు, ఏఐ ఉన్న ఖరీదైన ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు.

Also Read: అందరికీ ఫేవరెట్‌గా మారుతున్న యాపిల్ - ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఐఫోన్ 15!

జనరేటివ్ ఏఐ కారణంగా స్మార్ట్‌ఫోన్‌లు మరింత ఖరీదైనవిగా మారుతున్నాయి. ఏఐ ఫీచర్లను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. అందుకోసం స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు మరింత పవర్ ఫుల్ సీపీయూ, ఎన్‌పీయూ, జీపీయూతో చిప్‌లను తయారు చేస్తున్నాయి. ఈ చిప్‌ల ధర సాధారణంగా చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఫోన్ ధర కూడా పెరుగుతుంది. 4 ఎన్ఎం, 3 ఎన్ఎం వంటి కొత్త చిప్ తయారీ టెక్నాలజీ కారణంగా విడిభాగాల ధర కూడా పెరుగుతోంది. ఇది కాకుండా కంపెనీలు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడానికి, మెరుగుపరచడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

అప్‌గ్రేడ్ అవుతున్న స్మార్ట్ ఫోన్లు
అయితే టెక్నాలజీ డెవలప్ అవుతున్నందున స్మార్ట్‌ఫోన్లు కూడా అప్‌గ్రేడ్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ధర పెరగడంతో పాటు మంచి ఫోన్లు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇందులో మంచి కెమెరా, మరింత తెలివైన వర్చువల్ అసిస్టెంట్ ఉన్నాయి. రాబోయే కాలంలో ప్రత్యేక ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను కూడా చూడవచ్చు. ఏఐ వినియోగం పెరుగుతూ ఉండటంతో టెక్ దిగ్గజాలు కూడా ఏఐపై దృష్టి సారిస్తున్నాయి. ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఇదే అని చెప్పవచ్చు.

అలాగే ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లోనే కాకుండా మనదేశంలో కూడా ప్రీమియం స్మార్ట్ ఫోన్ల సేల్స్ విపరీతంగా పెరిగాయి. 2024 మూడో త్రైమాసికంలో మనదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో యాపిల్ రెండో స్థానంలో ఉంది. జులై నుంచి సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా అమ్ముడు పోయిన స్మార్ట్ ఫోన్లలో యాపిల్ రెండో స్థానంలో నిలిచింది. ఏకంగా 22 శాతం మార్కెట్ షేర్‌ను యాపిల్ మనదేశంలో సొంతం చేసుకోవడం విశేషం. భారతదేశంలోని టైర్ 2, టైర్ 3 సిటీల్లో కూడా ఐఫోన్ సేల్స్ విపరీతంగా పెరిగాయి. యాపిల్ అందిస్తున్న ఈజీ ఈఎంఐ ఆప్షన్లు కూడా దీని సేల్స్ పెరగడానికి ఒక కారణం.

Also Read: వాట్సాప్‌లో వీటిని షేర్ చేస్తే ఇక జైలుకే - రూల్స్‌ను టైట్ చేసిన గవర్నమెంట్!

టాప్ హెడ్ లైన్స్

OTP Tip To Check Call History: పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Embed widget