అన్వేషించండి

Samsung Galaxy Wide 6: కొత్త 5జీ ఫోన్ మార్కెట్లో లాంచ్ చేసిన శాంసంగ్ - మనదేశంలో మాత్రం?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త ఫోన్ గెలాక్సీ వైడ్ 6ను లాంచ్ చేసింది.

శాంసంగ్ గెలాక్సీ వైడ్ 6 స్మార్ట్ ఫోన్ దక్షిణ కొరియాలో లాంచ్ అయింది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. గతేడాది లాంచ్ అయిన గెలాక్సీ వైడ్ 5కు తర్వాతి వెర్షన్‌గా గెలాక్సీ వైడ్ 6 లాంచ్ అయింది. గెలాక్సీ వైడ్ 5లో కూడా ఇదే ప్రాసెసర్‌ను శాంసంగ్ అందించారు.

శాంసంగ్ గెలాక్సీ వైడ్ 6 ధర
దక్షిణ కొరియాలో మాత్రమే ఈ ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా లాంచ్ అయింది. అక్కడ దీని ధరను 3,49,000 వాంగ్‌లుగా (సుమారు రూ.20,200) నిర్ణయించారు. బ్లాక్, వైట్, బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దక్షిణ కొరియా ఎక్స్‌క్లూజివ్ ఫోన్ కాబట్టి మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం లేదు.

శాంసంగ్ గెలాక్సీ వైడ్ 6 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఇన్‌ఫినిటీ-వి డిస్‌ప్లేను అందించనున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. 5జీ, వైఫై, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ కోర్ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై శాంసంగ్ గెలాక్సీ వైడ్ 6 పని చేయనుంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ కోర్ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఇన్‌ఫినిటీ-వి డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో అందించారు. అయితే దీని పేరు మాత్రం తెలపలేదు. ఎక్సినోస్ 850 ప్రాసెసర్ అయ్యే అవకాశం ఉంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందించారు. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్/ఏ-జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. దీని మందం 0.91 సెంటీమీటర్లు కాగా, బరువు 195 గ్రాములుగా ఉంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Palnadu Double Murder: ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...

వీడియోలు

India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Palnadu Double Murder: ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
Mahesh Babu : రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
Pawan Kalyan Padala Maruti Suzuki Victoris: బిగ్‌బాస్ విన్నర్ పవన్‌ కల్యాణ్‌ పడాలా గెలుచుకున్న మారుతి సుజుకి విక్టోరిస్ ధర ఎంత? ఫీచర్స్‌ ఏంటీ?
బిగ్‌బాస్ విన్నర్ పవన్‌ కల్యాణ్‌ పడాలా గెలుచుకున్న మారుతి సుజుకి విక్టోరిస్ ధర ఎంత? ఫీచర్స్‌ ఏంటీ?
Bigg Boss 9 Emmanuel: చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
Embed widget