Samsung F34 5G: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఇవే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. అదే శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. ఎక్సినోస్ ప్రాసెసర్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ డిజైన్ చూడటానికి శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ తరహాలో ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ ధర
ఈ ఫోన్‌కు సంబంధించి రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999గా నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఆగస్టు 12వ తేదీ నుంచి దీని డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
ఐసీఐసీఐ బ్యాంకు లేదా కొటక్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా దీన్ని కొనుగోలు చేస్తే రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. నో కాస్ట్ ఈఎంఐ ప్లాన్లు రూ.2,111 నుంచి ప్రారంభం కానుంది. ఇంకా మరెన్నో బ్యాంకు ఆఫర్లు కూడా అందించారు. ఎలక్ట్రిక్ బ్లాక్, మిస్టిక్ గ్రీన్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.46 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఉంది. ఆక్టాకోర్ ఎక్సినోస్ 1280 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ కూడా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్ యూఐ 5.1 ఆపరేటింగ్ సిస్టం ద్వారా ఈ ఫోన్ రన్ కానుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 13 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. 5జీ, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, వైఫై, బ్లూటూత్ వీ5.3, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.88 మిల్లీమీటర్లు కాగా, బరువు 208 గ్రాములుగా ఉంది.
Now bumpy roads can't mess with your spectacular getaway clips. Time to capture moments without any hassle with the all-new #GalaxyF34 5G. It comes with an advanced 50MP No Shake Cam that lets you shoot shake-free videos, with ease, even when you are on the go. pic.twitter.com/bFLFfbMxCs
— Samsung India (@SamsungIndia) August 2, 2023
Read Also: వణుకు పుట్టిస్తున్న AI కెమేరాలు - ఒక్క నెలలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా 32 లక్షల మందికి జరిమానా
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial