అన్వేషించండి

Redmi A1 Plus Sale: రెడ్‌మీ కొత్త బడ్జెట్ ఫోన్ సేల్ ప్రారంభం - ధర రూ.ఏడు వేలలోపే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ మనదేశంలో రెడ్‌మీ ఏ1 ప్లస్‌ను సేల్‌ను ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మీ ఏ1 ప్లస్ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ లాంచ్ చేసిన లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ మొబైల్‌లో మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌ను అందించారు. మూడు వేర్వేరు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ అందించారు.

రెడ్‌మీ ఏ1 ప్లస్ ధర
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,999 కాగా, 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999గా ఉంది. బ్లాక్, లైట్ బ్లూ, లైట్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కాం, ఎంఐ హోం స్టోర్స్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మీ ఏ1 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై రెడ్‌మీ ఏ1 ప్లస్ పని చేయనుంది. ఇందులో 6.52 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే అందించారు. దీని టచ్ శాంప్లింగ్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. వాటర్ డ్రాప్ తరహా నాచ్‌ను ఈ ఫోన్‌లో అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్ కూడా రెడ్‌మీ ఏ1 ప్లస్‌లో ఉంది. 3 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్‌గా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఎక్కువ ఫీచర్లు ఇందులో ఆశించలేం.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 10w ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 30 రోజుల వరకు స్టాండ్‌బై టైం, 30 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైంను ఇది అందించనుంది. దీని మందం 0.9 సెంటీమీటర్లు కాగా, బరువు 192 గ్రాములుగా ఉంది.

4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, బైదు, 3.5 ఎంఎం ఆడియో జాక్‌లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. యాక్సెలరో మీటర్, ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా రెడ్‌మీ ఏ1 ప్లస్‌లో అందించారు. 20 భారతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

View this post on Instagram
 
A post shared by Redmi India (@redmiindia)

టాప్ హెడ్ లైన్స్

RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget