By: ABP Desam | Updated at : 28 Jul 2022 10:13 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
రెడ్‌మీ 10ఏ స్పోర్ట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది.
రెడ్‌మీ ఇండియా మనదేశంలో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే రెడ్‌మీ 10ఏ స్పోర్ట్. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.53 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్, వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా అందుబాటులో ఉన్నాయి.
రెడ్‌మీ 10ఏ స్పోర్ట్ ధర
రెడ్‌మీ 10ఏ స్పోర్ట్‌లో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధర రూ.10,999గా నిర్ణయించారు. చార్‌కోల్ బ్లాక్, స్లేట్ గ్రే, సీ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ ఇండియా, ఎంఐ స్టోర్లలో రెడ్‌మీ 10ఏ స్పోర్ట్ కొనుగోలు చేయవచ్చు.
రెడ్‌మీ 10ఏ స్పోర్ట్ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.53 అంగుళాల వాటర్ డ్రాప్ నాచ్ తరహా హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1600 x 720 పిక్సెల్స్‌గా ఉంది. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్‌పై రెడ్‌మీ 10ఏ స్పోర్ట్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఇంకా పెంచుకునే అవకాశం ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... రెడ్‌మీ 10ఏ స్పోర్ట్‌లో వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 10W ఫాస్ట్ చార్జింగ్‌ను రెడ్‌మీ 10ఏ స్పోర్ట్ సపోర్ట్ చేయనుంది.
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. మైక్రో యూఎస్‌బీ పోర్టును అందించారు. ఫింగర్ ప్రింట్ ఫోన్ వెనకవైపు ఉంది. 3.5 ఎంఎం ఆడియో జాక్ ద్వారా ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. డ్యూయల్ సిమ్, 4జీ, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, ఏజీపీఎస్, బైదు కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని మందం 0.9 సెంటీమీటర్లు కాగా, బరువు 194 గ్రాములుగా ఉంది.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!
Mobile Over Heating: మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
Jio 5G Phone: రూ.10 వేలలోపే జియో 5జీ ఫోన్ - ప్రత్యేకతలు ఏంటంటే?
Vivo V25 Pro: ఊహించిన దాని కంటే తక్కువ ధరకే - లాంచ్ అయిన వివో వీ25 ప్రో!
Moto Razr 2022: ఐదు నిమిషాల్లో 10 వేల సేల్స్ - మోటొరోలా ఫోన్ కొత్త రికార్డు!
Samsung Galaxy: అదిరిపోయే స్మార్ట్ ఫోన్లకు ప్రీ బుకింగ్ షురూ, ఇప్పుడే బుక్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఇవే
Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ లీడర్ హత్య కేసులో నిందితుల అరెస్టు
రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్‌న్యూస్, తెలంగాణ సర్కార్‌కు షాక్ - కీలక తీర్పు
Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!
KCR News: 21న కరీంనగర్‌కు సీఎం కేసీఆర్, ఆసక్తికరంగా ఆ ఏర్పాట్లు - గతంలో ఎప్పుడూ లేనట్లుగా