అన్వేషించండి

Realme Q5 Series: రూ.16 వేలలోనే రియల్‌మీ కొత్త 5జీ ఫోన్ - వావ్ అనిపించే ఫీచర్లు కూడా!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన క్యూ5 సిరీస్ ఫోన్లు లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో క్యూ5, క్యూ5 ప్రో మొబైల్స్ ఉన్నాయి.

రియల్‌మీ క్యూ5, రియల్‌మీ క్యూ5 ప్రో స్మార్ట్ ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. కంపెనీ ఇటీవలే అందుబాటులోకి తెచ్చిన క్యూ-సిరీస్‌లో ఈ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లు, వెనకవైపు మూడేసి కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంను రెండిట్లోనూ అందించారు.

రియల్‌మీ క్యూ5 ధర
రియల్‌మీ క్యూ5 మొత్తంగా మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,399 యువాన్లుగా (సుమారు రూ.16,600) ఉంది. ఇక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,599 యువాన్లుగానూ (సుమారు రూ.18,900), 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,799 యువాన్లుగానూ (సుమారు రూ.21,200) నిర్ణయించారు. ఫాంటం, రేసింగ్ డస్క్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మీ క్యూ5 ప్రో ధర
ఇందులో కూడా మూడే వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,799 యువాన్లుగా (సుమారు రూ.21,200) కాగా... 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,999 యువాన్లుగా (సుమారు రూ.23,700) ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,199 యువాన్లుగా (సుమారు రూ.26,000) నిర్ణయించారు. ఫాంటం, స్నో డ్రిఫ్ట్, సమ్మర్ ఇంజిన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్లు మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతాయో తెలియరాలేదు.

రియల్‌మీ క్యూ5 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా... స్క్రీన్ టు బాడీ రేషియో 90.8 శాతంగా ఉంది.

8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 60W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ షూటర్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరో స్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉంది. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా... బరువు 195 గ్రాములుగా ఉంది.

రియల్‌మీ క్యూ5 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఏకంగా 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్‌లో కూడా వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది. 80W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.86 సెంటీమీటర్లు కాగా... బరువు 194.5 గ్రాములుగా ఉంది.

Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?

Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
యమహా R2 నుంచి ఎలక్ట్రిక్‌ ఏరోక్స్‌ వరకు - 2026లో లాంచ్‌ కానున్న యమహా బైక్స్‌, స్కూటర్లు ఇవే
2026లో య'మహా' ప్లాన్‌ - రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, కొత్త R2 స్పోర్ట్‌ బైక్‌ రెడీ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget