By: ABP Desam | Updated at : 14 Aug 2022 08:33 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
రియల్‌మీ చవకైన 5జీ ఫోన్ త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది.
రియల్‌మీ మనదేశంలో కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. రియల్‌మీ 10 సిరీస్‌తో పాటు చవకైన 5జీ ఫోన్‌ను కూడా కంపెనీ లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని రియల్‌మీ ఇండియా సీఈవో మాధవ్ సేథ్ అధికారికంగా ప్రకటించారు.
రూ.10 వేలలోపే స్మార్ట్ ఫోన్
చవకైన 5జీ ఫోన్‌పై రియల్‌మీ ఎప్పట్నుంచో పనిచేస్తుంది. రూ.10 వేల నుంచి రూ.15 వేల మధ్యలో దీని ధర ఉండే అవకాశం ఉంది. రూ.15 వేల రేంజ్‌లో 5జీ ఫోన్లు ఇప్పటికే వచ్చాయి కాబట్టి రూ.10 వేలలో ఈ ఫోన్ ధర ఉండవచ్చు.
దీంతోపాటు మరో రెండు, మూడు కొత్త విభాగాల్లోకి రియల్‌మీ ఎంటర్ కానుందని వార్తలు మాధవ్ తెలిపారు. వాటి గురించిన సమాచారం త్వరలో అధికారికంగా ప్రకటిస్తామన్నారు. చిప్ షార్టేజ్ సమస్య కూడా క్రమంగా తీరుతున్నందున మరిన్ని మంచి స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
రియల్‌మీ 10 సిరీస్ స్మార్ట్ ఫోన్లు అక్టోబర్‌లో దీపావళి సందర్భంగా లాంచ్ కానున్నాయని వార్తలు వస్తున్నాయి. పండగల సందర్భంగా వచ్చే ఆఫర్లలో స్మార్ట్ ఫోన్లు కొనడానికి ఎక్కువమంది వెయిట్ చేస్తారు కాబట్టి ఆ టైంలో మంచి స్మార్ట్ ఫోన్లు వస్తే కచ్చితంగా ఆదరణ లభిస్తుంది. చాలా స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఈ మోడల్‌ను ఫాలో అవుతాయి.
రియల్‌మీ ఇటీవలే తన ట్యాబ్లెట్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే రియల్‌మీ ప్యాడ్ ఎక్స్. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. రియల్‌మీ లాంచ్ చేసిన మొదటి 5జీ ట్యాబ్లెట్ ఇదే. ట్యాబ్లెట్ వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. క్వాడ్ స్పీకర్ సెటప్ కూడా ఈ ట్యాబ్లెట్‌లో ఉంది.
దీని ధర మనదేశంలో రూ.19,999 నుంచి ప్రారంభం కానుంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. ఇది వైఫైని సపోర్ట్ చేయనుంది. 5జీ ఫీచర్ సపోర్ట్ చేసే మోడల్ ధర రూ.25,999గా ఉంది. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో 5జీ సపోర్ట్ చేసే మోడల్ ధర రూ.27,999గా ఉంది. గ్లేసియర్ బ్లూ, గ్లోయింగ్ గ్రే రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ.కాం, ఆఫ్‌లైన్ రిటైల్ చానెళ్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల ద్వారా దీన్ని కొనుగోలు చేస్తే రూ.2,000 తగ్గింపు లభించింది. అంటే రూ.17,999కే దీన్ని కొనేయచ్చన్న మాట.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఫర్ ప్యాడ్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. ఇందులో 11 అంగుళాల 2కే డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ద్వారా మరో 5 జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు.
ట్యాబ్లెట్ వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ముందువైపు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ద్వారా వీడియో కాల్స్ చేసుకోవచ్చు, సెల్ఫీలు తీసుకోవచ్చు. దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ 105 డిగ్రీలుగా ఉంది. 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఇందులో ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.
స్మార్ట్ కీబోర్డు, రియల్‌మీ మ్యాగ్నటిక్ స్టైలస్‌ను కూడా ఈ ట్యాబ్ సపోర్ట్ చేయనుంది. అయితే వీటిని ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. నాలుగు స్పీకర్లు ఈ ట్యాబ్‌లో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 8340 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!
iPhone 15: 10 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ - ఎక్కడ అందుబాటులో ఉంది? ఎందులో ఆర్డర్ చేయాలి?
Tecno Phantom V Flip: దేశంలో అత్యంత చవకైన ఫ్లిప్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది - టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ లాంచ్!
iPhone 15: నేటి నుంచి ఐఫోన్ 15 విక్రయాలు, యాపిల్ స్టోర్ వద్ద బారులు తీరిన జనం!
Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!
Big Billion Days 2023 Sale: బంపర్ ఆఫర్లతో రానున్న ఫ్లిప్‌కార్ట్ - బిగ్ బిలియన్ డేస్‌కు ముహూర్తం ఫిక్స్ - వేటిపై ఆఫర్లు!
Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత
కాంగ్రెస్ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!
IND Vs AUS: రెండో వన్డేలో తుదిజట్లు ఎలా ఉంటాయి? - భారత్ మార్పులు చేస్తుందా?
/body>