Realme GT2 Explorer Master Edition: రియల్‌మీ సూపర్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తుంది - ఆ ధరలో బెస్ట్ ఫోన్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను జులైలో లాంచ్ చేయనుంది.
రియల్‌మీ జీటీ2 ఎక్స్‌ప్లోరర్ మాస్టర్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ఎప్పట్నుంచో వార్తల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఫోన్ ఇటీవలే టెనా సర్టిఫికేషన్ సైట్లో కూడా కనిపించింది. రియల్‌మీ జీటీ2 ఎక్స్‌ప్లోరర్ మాస్టర్ ఎడిషన్‌కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీన్ని బట్టి ఈ ఫోన్ త్వరలోనే లాంచ్ కానుందని అనుకోవచ్చు. మనదేశంలో మూడో త్రైమాసికంలో రియల్‌మీ జీటీ2 ఎక్స్‌ప్లోరర్ మాస్టర్ ఎడిషన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం జులైలోనే రియల్‌మీ జీటీ2 ఎక్స్‌ప్లోరర్ మాస్టర్ ఎడిషన్ లాంచ్ కానుందని రియల్‌మీ ప్రెసిడెంట్ క్సూ కీ చేజ్ తెలిపారు. గతేడాది జులైలో లాంచ్ అయిన రియల్‌మీ జీటీ ఎక్స్‌ప్లోరర్ మాస్టర్ ఎడిషన్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది.
ఈ స్మార్ట్ ఫోన్ ధర 3,000 యువాన్ల (సుమారు రూ.35,000) రేంజ్‌లో ఉండనుంది. గతేడాది జులైలో లాంచ్ అయిన రియల్‌మీ జీటీ ఎక్స్‌ప్లోరర్ మాస్టర్ ఎడిషన్ ధరను 2,899 యువాన్లుగా (సుమారు రూ.34,000) నిర్ణయించారు.
రియల్‌మీ జీటీ2 మాస్టర్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.7 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉండనుంది. 6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్, 12 జీబీ ర్యామ్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అలాగే 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నారు.
దీని మందం 0.82 సెంటీమీటర్లు కాగా, బరువు 199 గ్రాములుగా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4800 నుంచి 5000 ఎంఏహెచ్ మధ్యలో దీని బ్యాటరీ సామర్థ్యం ఉండనుందని తెలుస్తోంది. 100W లేదా 150W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!