Oppo Reno 8 Series: కేక పుట్టించే కెమెరాలతో ఒప్పో కొత్త ఫోన్లు - ఈ నెలలోనే లాంచ్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో మనదేశంలో రెనో 8 సిరీస్‌ను త్వరలో లాంచ్ చేయనుంది.
![Oppo Reno 8 Series: కేక పుట్టించే కెమెరాలతో ఒప్పో కొత్త ఫోన్లు - ఈ నెలలోనే లాంచ్! Oppo Reno 8 Series Smartphones Teased to Launch Soon in India Oppo Reno 8 Series: కేక పుట్టించే కెమెరాలతో ఒప్పో కొత్త ఫోన్లు - ఈ నెలలోనే లాంచ్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/01/1e9f5854d601945aff7db03f455eb889_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఒప్పో రెనో 8 సిరీస్ ఫోన్లు మనదేశంలో త్వరలో లాంచ్ కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ టీజ్ చేసింది. ఒప్పో రెనో 8, ఒప్పో రెనో 8 ప్రో స్మార్ట్ ఫోన్లు ఈ సిరీస్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఒప్పో రెనో 8 ప్రోలో కెమెరా క్వాలిటీ కోసం ప్రత్యేకంగా మారిసిలికాన్ ఎక్స్ సిలికాన్ చిప్‌ను అందించనున్నారు. దీన్ని ఒప్పోనే రూపొందించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఒప్పో రెనో 8, ఒప్పో రెనో 8 ప్రో, ఒప్పో రెనో 8 ప్రో ప్లస్‌లను కంపెనీ లాంచ్ చేసింది.
జులై 21వ తేదీన ఈ సిరీస్ మనదేశంలో లాంచ్ కానుందని ప్రముఖ టిప్‌స్టర్ తెలిపారు. ఒప్పో కచ్చితమైన తేదీని వెల్లడించలేదు కానీ... త్వరలో లాంచ్ కానున్నాయని ట్వీట్ ద్వారా తెలిపింది. ఒప్పో రెనో 8, ఒప్పో రెనో 8 ప్రో స్మార్ట్ ఫోన్లు ఈ సిరీస్‌లో లాంచ్ కానున్నాయి. ఒప్పో రెనో 8 ప్రో ప్లస్ లాంచ్ కానుందో లేదో తెలియరాలేదు.
అయితే కంపెనీ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లను రివీల్ చేయలేదు. ఒప్పో రెనో 8లో చైనా వేరియంట్ స్పెసిఫికేషన్లే ఉండే అవకాశం ఉంది. అయితే చైనాలో లాంచ్ అయిన ఒప్పో రెనో 8 ప్రో ప్లస్‌ను రీబ్రాండ్ చేసి ఒప్పో రెనో 8 ప్రోగా మనదేశంలోకి తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి ఒప్పో రెనో 8 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ లేదా క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్ ఉండనుంది.
దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లను జులై 5వ తేదీన, జులై 11వ తేదీన ఒప్పో రివీల్ చేయనుంది. ఒప్పో రెనో 8 సిరీస్ ఫోన్లు కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్లుగా లాంచ్ కానున్నాయి. వీటిలో కెమెరాపైనే ఒప్పో ప్రధానంగా ఫోకస్ పెట్టనుంది. ఈ ఫోన్లు మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానున్నాయో కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. దీంతోపాటు ఒప్పో ప్యాడ్ ఎయిర్ కూడా మనదేశంలో లాంచ్ కానుందని తెలుస్తోంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)