By: ABP Desam | Updated at : 05 Jun 2023 04:12 PM (IST)
నథింగ్ ఫోన్ (2) జులైలో లాంచ్ కానుంది. ( Image Source : Twitter )
Nothing Phone 2 Launch: గతేడాది లాంచ్ అయిన నథింగ్ ఫోన్ (1) మంచి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నథింగ్ ఫోన్ (2) లాంచ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. ఈ ఫోన్ మనదేశంలో జూలైలో లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.
నథింగ్ ఫోన్ (2) స్పెసిఫికేషన్లు (అంచనా)
నథింగ్ ఫోన్ (2)లో 6.7 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్‌ని అందించనున్నారు. ఇది 120hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేయనుంది. స్మార్ట్‌ఫోన్ 4700 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది, ఇది మునుపటి కంటే మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్‌సెట్‌తో నథింగ్ ఫోన్ 2 పని చేయనుంది.
ఈ సమాచారాన్ని కంపెనీ సీఈవో స్వయంగా ధృవీకరించారు. ఈ స్మార్ట్‌ఫోన్ మునుపటి వెర్షన్ అయిన నథింగ్ ఫోన్ (1) కంటే పర్యావరణ అనుకూలమైనది. కంపెనీ ఫోన్‌లోని 28 స్టీల్ భాగాలలో 90 శాతం రీసైకిల్ స్టీల్‌ను ఉపయోగించింది. ఫోన్‌లో అల్యూమినియం సైడ్ ఫ్రేమ్‌లు ఉన్నాయి. ఇవి 100% రీసైకిల్ అయినవే.
నథింగ్ ఫోన్ (2) వినియోగదారులకు మూడు సంవత్సరాల పాటు OS అప్‌డేట్‌లను, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌లు పొందుతారు. మొబైల్ ఫోన్ కెమెరా, డిజైన్‌కు సంబంధించి పెద్దగా వివరాలు వెల్లడించలేదు.
ధర ఎంత ఉండవచ్చు?
నథింగ్ ఫోన్ (1)ని కంపెనీ రూ. 32,999 ధరతో లాంచ్ చేసింది. నథింగ్ ఫోన్ (2) ధర దాదాపు రూ. 40 వేలు ఉండే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఎక్స్‌క్లూజివ్‌గా నథింగ్ ఫోన్ (2)ను కొనుగోలు చేసే అవకాశం ఉంది.
నథింగ్ ఫోన్ 1 ప్రస్తుతం రూ.28,999కే అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు కార్డుల ద్వారా కొంటే అదనంగా 10 శాతం తగ్గింపు లభించనుంది. దీంతో ఈ ఫోన్ రూ.28,999కే లభించనుంది. ఎక్స్‌చేంజ్ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.3,000 తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది.
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఇందులో అందించారు. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 33W వైర్డ్ చార్జింగ్, 15W వైర్‌లెస్ చార్జింగ్, 5W రివర్స్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, వైఫై 6 డైరెక్ట్, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఫీచర్లు అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్ ఉండగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ శాంసంగ్ జేఎన్1 సెన్సార్‌ను అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌గా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్471 కెమెరా ఉంది.
Read Also: వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్, ఇకపై మీ స్క్రీన్ ఇతరులకు షేర్ చెయ్యొచ్చు!
iPhone 15: 10 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ - ఎక్కడ అందుబాటులో ఉంది? ఎందులో ఆర్డర్ చేయాలి?
Tecno Phantom V Flip: దేశంలో అత్యంత చవకైన ఫ్లిప్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది - టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ లాంచ్!
iPhone 15: నేటి నుంచి ఐఫోన్ 15 విక్రయాలు, యాపిల్ స్టోర్ వద్ద బారులు తీరిన జనం!
Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!
Big Billion Days 2023 Sale: బంపర్ ఆఫర్లతో రానున్న ఫ్లిప్‌కార్ట్ - బిగ్ బిలియన్ డేస్‌కు ముహూర్తం ఫిక్స్ - వేటిపై ఆఫర్లు!
Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత
కాంగ్రెస్ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!
IND Vs AUS: రెండో వన్డేలో తుదిజట్లు ఎలా ఉంటాయి? - భారత్ మార్పులు చేస్తుందా?
/body>