C12 Budget Smartphone: నోకియా నుంచి రూ.6 వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్, ఫీచర్లు కూడా అదుర్స్
ఒకప్పుడు మొబైల్ ప్రపంచాన్ని ఏలిన నోకియా రానురాను ప్రజాదరణ కోల్పోయింది. ఇతర కంపెనీల ముందు తట్టుకోలేకపోయింది. అయినా, ఇంకా సరికొత్త ఫోన్లతో వినియోదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
నోకియా.. ఒకప్పుడు మొబైల్ ప్రపంచంలో మార్మోగిన పేరు. నోకియా ఫోన్ అంటే వినియోగదారులకు ఎనలేని ఆసక్తి. మంచి బ్యాటరీ బ్యాకప్. కింద పడినా తట్టుకునే బాడీ. రఫ్ అండ్ టఫ్ గా ఉపయోగించుకునే అవకాశం. ఇవే ఆ మోబైల్ ను గ్రామీణ ప్రాంతాల వినియోగదారుల చెంతకు చేరేలా చేసింది. స్మార్ట్ ఫోన్ల రాకతో పోటీలో వెనుకబడింది. విండోస్ ఓఎస్ తో యూజర్ల ముందుకు వచ్చినా, పెద్దగా క్లిక్ కాలేదని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి అడుగు పెట్టాయి. నెమ్మదిగా వరుస బెట్టి రకరకాల స్మార్ట్ ఫోన్లను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఓ వైపు ప్రీమియం స్మార్ట్ ఫోన్లతో పాటు, మరోవైపు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను కూడా మార్కెట్లోకి విడుదల చేస్తోంది. మోబైల్ వరల్డ్ లో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.
నోకియా సీ12 ధర కేవలం రూ. 5,999
తాజాగా మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను వినియోగదారుల చెంతకు తీసుకొచ్చింది. నోకియా సీ12 పేరిట భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. కంపెనీ ఈ నూతన స్మార్ట్ ఫోన్ ధర కేవలం రూ. 5,999గా నిర్ణయించింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లాంటి ఈ కామర్స్ సైట్స్ లో అందుబాటులో ఉన్నాయి.
అదిరిపోయే ఫీచర్లతో అందుబాటులోకి..
ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ఫోన్ అయిన ఫీచర్లు బాగానే ఉన్నాయి. 2 జీబీ ర్యామ్ అమర్చారు. 64 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ అందిస్తున్నారు. ఇక డిస్ ప్లే కూడా చాలా బాగుంది. 6.3 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్ ప్లేను అందిస్తోంది. బ్రైట్ నెస్ బూస్ట్, సెల్ఫీ నాచ్ ను సైతం ఈ స్మార్ట్ ఫోన్ కు యాడ్ చేసింది. ఇక నోకియా సీ 12 Unisoc 9863A1 ఆక్టాకోర్ ప్రాసెసర్ ద్వారా రన్ అవుతోంది. కెమెరా పనితీరు కూడా చాలా బాగుంది. ఇందులో 8 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. 5W చార్జింగ్ కు సపోర్ట్ చేసే 3000mAh బ్యాటరీని అందిస్తోంది. ఆండ్రాయిడ్ 12గో ఆపరేటింగ్ సిస్టమ్ తో ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ పని చేస్తుంది. ఇక దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP52 రేటింగ్ ఇచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ పలు రంగుల్లో అందుబాటులో ఉంది. డార్క్ సియాన్, చార్ కోల్, లైట్ మింట్ కలర్స్ లలో వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ తో తన అమ్మకాలు భారీగా పెంచుకోవాలని నోకియా కంపెనీ భావిస్తోంది.
View this post on Instagram
Read Also: మీ ఫోన్ పోయిందా? జస్ట్ ఈ టిప్స్ పాటిస్తే కొత్త ఫోన్‌లోకి వాట్సాప్ చాట్ రికవరీ చేసుకోవచ్చు!