![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Motorola 200MP Camera Phone: మోటొరోలా సూపర్ కెమెరా ఫోన్ వచ్చేస్తుంది... 200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో!
200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో మొట్టమొదటి స్మార్ట్ ఫోన్‌ను మోటొరోలా త్వరలో లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జులైలో ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది.
![Motorola 200MP Camera Phone: మోటొరోలా సూపర్ కెమెరా ఫోన్ వచ్చేస్తుంది... 200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో! Motorola First 200MP Camera Phone in the World May be Launched in July Details Motorola 200MP Camera Phone: మోటొరోలా సూపర్ కెమెరా ఫోన్ వచ్చేస్తుంది... 200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/12/3efe5d90084ca0d0519914fa5a7dfb1e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
శాంసంగ్ 200 మెగాపిక్సెల్ కెమెరాతో మొదటి స్మార్ట్ ఫోన్‌ను మోటొరోలా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. జులైలో ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. శాంసంగ్ తన 200 మెగాపిక్సెల్ ఐసోసెల్ హెచ్‌పీ1 సెన్సార్‌ను 2021 సెప్టెంబర్‌లో లాంచ్ చేసింది. ఈ సెన్సార్ పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీని ఉపయోగించుకోనుంది. మోటొరోలాతో పాటు షియోమీ కూడా ఈ సంవత్సరం 200 మెగాపిక్సెల్ కెమెరాతో ఫోన్ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక శాంసంగ్ 2023లో 200 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది.
ప్రపంచంలో మొట్టమొదటి 200 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్‌ను మోటొరోలా లాంచ్ చేయనుందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం మోటొరోలా, షియోమీ, 2023లో శాంసంగ్ 200 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయాన్ని మోటొరోలా అధికారికంగా ప్రకటించలేదు. శాంసంగ్ 200 మెగాపిక్సెల్ ఐసోసెల్ హెచ్‌పీ1 సెన్సార్‌లో 0.64 మైక్రాన్ పిక్సెల్స్‌ను అందించనున్నారు. కెమెలియన్ సెల్ టెక్నాలజీ కూడా ఇందులో ఉండనుంది. టూ బై టూ, ఫోర్ బై ఫోర్ లేదా ఫుల్ పిక్సెల్ లేఅవుట్‌ను ఇది ఉపయోగించుకోనుంది. దీని ద్వారా వినియోగదారులు 12.5 నుంచి 200 మెగాపిక్సెల్ రిజల్యూషన్స్ మధ్యలో ఫొటోలు తీసుకోవచ్చు.
200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో పాటు మోటొరోలా ఎడ్జ్ ఎక్స్ అనే స్మార్ట్ ఫోన్‌ను కూడా కంపెనీ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 60 మెగాపిక్సెల్ ఓమ్నీవిజన్ ఓవీ60ఏ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను ఉపయోగించనున్నారు. దీంతోపాటు ఇందులో 50 మెగాపిక్సెల్ ఓమ్నీవిజన్ కెమెరాను ప్రధాన కెమెరాగా అందించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)