Motorola Edge 30 Fusion: మనదేశంలో మోటొరోలా కొత్త ఫోన్ - లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టంతో!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ చేయనుంది.
మోటొరోలా ఎడ్జ్ 30 స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఈ సంవత్సరం మేలో లాంచ్ అయింది. ఇప్పుడు ఇదే సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. మోటో జీ30 ఫ్యూజన్‌ని కంపెనీ మనదేశంలో త్వరలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది.
XT2243-1 అనే మోడల్ నంబర్ ఉన్న ఫోన్ బీఐఎస్ వెబ్ సైట్లో కనిపించింది. బీఐఎస్ వెబ్‌సైట్లో కనిపించిందంటే ఈ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానున్నట్లే. అయితే ఈ లిస్టింగ్‌లో ఫోన్ మోడల్ నంబర్ మాత్రమే కనిపించింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మోటొరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ ఫీచర్లు (అంచనా)
గతంలో లీకైన ఫీచర్ల ప్రకారం ఇందులో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండనుంది. అయితే ఇది ఎల్సీడీ స్క్రీనా లేకపోతే అమోఎల్ఈడీ డిస్‌ప్లేనా అన్నది తెలియరాలేదు. 90 హెర్ట్జ్ లేదా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేసే అవకాశం ఉంది. ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ వివరాలు ఇంకా తెలియరాలేదు. లాంచ్‌కు దగ్గరయ్యే కొద్దీ ఈ వివరాలు తెలిసే అవకాశం ఉంది.
మోటొరోలా ఎక్స్30 ప్రో స్మార్ట్ ఫోన్ 200 మెగాపిక్సెల్ కెమెరాతో చైనాలో ఇటీవలే లాంచ్ అయింది. ప్రపంచంలో 200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో లాంచ్ అయిన మొదటి ఫోన్ ఇదే. మోటొరోలా ఎక్స్30 ప్రోలో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,699 యువాన్లుగా (సుమారు రూ.43,600) నిర్ణయించారు. ఇక 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,199 యువాన్లుగానూ(సుమారు రూ.49,500), 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,499 యువాన్లుగానూ (సుమారు రూ.53,000) ఉంది.
ఇందులో 6.73 అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ టెలిఫొటో షూటర్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 60 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా ఉంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై మోటొరోలా ఎడ్జ్ 30 పనిచేయనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 125W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కేవలం ఏడు నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్, 19 నిమిషాల్లోనే పూర్తి చార్జింగ్ ఎక్కనుంది. 50W వైర్‌లెస్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!