అన్వేషించండి

Moto G42: సూపర్ డిస్‌ప్లేతో వస్తున్న మోటో కొత్త ఫోన్ - లాంచ్ ఎప్పుడంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త స్మార్ట్ ఫోన్ మోటో జీ42ని మనదేశంలో త్వరలో లాంచ్ చేయనుంది.

మోటొరోలా మనదేశంతో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడానికి సిద్దం అవుతోందని తెలుస్తోంది. అది మోటో జీ42 అయ్యే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్రెజిల్‌లో ఈ సంవత్సరంలోనే లాంచ్ అయింది. ఇందులో ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. మోటో జీ42 వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి.

ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ తెలుపుతున్న దాని ప్రకారం ఈ ఫోన్ మనదేశంలో వచ్చే వారం లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ లాంచ్ తేదీ తెలియరాలేదు. బ్రెజిల్‌లో ఈ ఫోన్ అట్లాంటిక్ గ్రీన్, మెటాలిక్ రోజ్ రంగుల్లో లాంచ్ అయింది. ఆసియా, యూరోప్, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో కూడా ఈ ఫోన్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

మోటో జీ42 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ జీ-ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. మోటో జీ42 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉండగా... యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్లస్ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. యాక్సెలరో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, కంపాస్ సెన్సార్లు అందించారు.

ఫింగర్ ప్రింట్ సెన్సార్ మొబైల్ పక్కభాగంలో ఉంది. మోటో జీ42 బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 20W టర్బోపవర్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.8 సెంటీమీటర్లు కాగా... బరువు 174.5 గ్రాములుగా ఉంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Most Expensive Vegetables : ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Most Expensive Vegetables : ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
Turmeric Water : రోజూ పసుపు నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఈ Side Effects తెలిస్తే షాక్ అవుతారు
రోజూ పసుపు నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఈ Side Effects తెలిస్తే షాక్ అవుతారు
ఎగిరే రథాల నుంచి కదిలే విగ్రహాలు, తుప్పు పట్టని స్తంభాల వరకు ఆశ్చర్యపరిచే విజ్ఞానం - పురాతన భారతదేశ అద్భుత సాంకేతికత!
ఎగిరే రథాల నుంచి కదిలే విగ్రహాలు, తుప్పు పట్టని స్తంభాల వరకు ఆశ్చర్యపరిచే విజ్ఞానం - పురాతన భారతదేశ అద్భుత సాంకేతికత!
Avatar Fire And Ash: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' బడ్జెట్ నుంచి నటీనటుల వరకు... జేమ్స్ కామెరూన్ సినిమా సంగతులు
'అవతార్ ఫైర్ అండ్ యాష్' బడ్జెట్ నుంచి నటీనటుల వరకు... జేమ్స్ కామెరూన్ సినిమా సంగతులు
Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Embed widget