అన్వేషించండి

Mobile Recharge Price Hike: త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి

Mobile Recharge Plan Hike:త్వరలో Jio, Airtel తమ మొబైల్ టారిఫ్‌లను 12 నుంచి 15 శాతం వరకు పెంచవచ్చని అంచనా వేస్తున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మీడియా నివేదిక ప్రకారం, మొబైల్ రీచార్జ్ ధరలు పెరగొచ్చు.
  • వచ్చే 3-4 నెలల్లో 12-15 శాతం పెంపు అంచనా వేస్తున్నారు.
  • నెట్‌వర్క్ విస్తరణ, 5G, ARPU వృద్ధికి కంపెనీల లక్ష్యం.
  • భారత టెలికాం మార్కెట్‌లో జియో, ఎయిర్‌టెల్ ఆధిపత్యం కొనసాగుతోంది.

Mobile Recharge Price Hike: దేశంలోని 2 పెద్ద టెలికాం కంపెనీలు Airtel, Reliance Jio మరోసారి ప్రజలకు షాకివ్వడానికి సిద్ధమవుతున్నాయి. అవును, ఒక రిపోర్ట్ ప్రకారం త్వరలోనే మొబైల్ రీచార్జ్ ధరలు సుమారు 15 శాతం వరకు పెరగవచ్చు.  ఇటీవల Airtel తన కొన్ని తక్కువ ధర ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్ నిలిపివేసింది. దాంతో వినియోగదారులు ఇప్పుడు ఖరీదైన రీచార్జ్‌లు చేయించుకోవాల్సి వస్తోంది. రాబోయే 3 నుంచి 4 నెలల్లో మళ్లీ రీచార్జ్ ధరలు పెరగనుండటం ప్రజలకు చాలా భారంగా మారవచ్చు. అందుకు సంస్థలు ఏం కారణాలు చెబుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

3-4 నెలల్లో రీచార్జ్ ధరలు పెరగొచ్చు

మీడియా రిపోర్ట్ ప్రకారం Jio మరియు Airtel తమ మొబైల్ టారిఫ్‌లను 12 నుంచి 15 శాతం వరకు పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఇది ఇప్పటికి కేవలం ఒక మార్కెట్ ఫోర్‌కాస్ట్ మాత్రమే. రెండు కంపెనీల నుంచి ఇలాంటి ధర పెంపుపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.

ఈ అంచనా నిజమైతే, దాని ప్రభావం ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ 2 రకాల వినియోగదారులపై కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతి నెల లేదా మూడు నెలలకు ఒకసారి మొబైల్ రీచార్జ్ చేసుకునే వినియోగదారులు ఇప్పుడు రీచార్జ్ కోసం ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది.

టారిఫ్‌లు ఎందుకు పెరగొచ్చు?

టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడూ తమ టారిఫ్‌లలో మార్పులు చేస్తుంటాయి. దీని వెనుక నెట్‌వర్క్ విస్తరణ, 5G ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్పెక్ట్రం ఖర్చులు, అలాగే ప్రతి కస్టమర్ నుంచి వచ్చే ఆదాయం అంటే ARPU పెంచడం లాంటి కారణాలు ఉంటాయి. కంపెనీలు ధరలు పెంచితే తక్కువ ధర ప్లాన్‌లు మరింత ఖరీదు అవుతాయి. అంటే, ఇప్పటికే ప్రైమరీ ప్లాన్ రీఛార్జ్ చేస్తున్న వినియోగదారులు కొంచెం ఎక్కువ ఖర్చుతో రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది.

Jio, Airtel లాభాలపై ప్రశ్నలు

మొబైల్ రీచార్జ్ మరింత ఖరీదు అవుతుందన్న చర్చ వైరల్ అవుతోంది. Ji, Airtel రెండూ గత సంవత్సరం 30,000 కోట్లకు పైగా నెట్ ప్రాఫిట్ నమోదు చేశాయి. దీంతో చాలా మంది వినియోగదారులకు కంపెనీలు ఇంత లాభం ఆర్జిస్తున్నప్పుడు మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు పెంచాల్సిన అవసరం ఉండదని భావించారు. మళ్లీ ఎందుకు ఎందుకు పెంచుతున్నార్న ప్రశ్న మొదలైంది.

వినియోగదారులపై ప్రభావం 

వైరల్ అవుతున్న సమాచారం మేరకు 12 నుంచి 15 శాతం రీచార్జ్ ప్లాన్ ధరలు పెరుగుతాయి. ఉదాహరణకు, ఒక రీచార్జ్ ప్లాన్ ధర 500 రూపాయలు ఉంటే, అది 12 శాతం పెరిగితే అదే ప్లాన్ కోసం 560 రూపాయలు చెల్లించాలి. అదే 15 శాతం పెరిగితే కస్టమర్ 575 రూపాయలు చెల్లించాల్సి రావచ్చు.

టెలికాం రంగంలో పెరుగుతున్న Duopoly

వాస్తవానికి, భారత్ టెలికాం మార్కెట్‌లో Jio, Airtel ఆధిపత్యం కొనసాగుతోంది. మరోవైపు Vodafone Idea, BSNL వంటి ఇతర ఆపరేటర్లు కూడా ఉన్నప్పటికీ, ప్రైవేట్ మొబైల్ మార్కెట్‌లో Jio, Airtel స్థానం పటిష్టంగా ఉంది. టెలికాం రంగంలో Duopoly గురించి చర్చ కొనసాగుతూనే ఉంటుంది. డుయోపోలీ అంటే ఒక రంగంలో ప్రధానంగా 2 కంపెనీల ఆధిపత్యం ఉండే మార్కెట్ కండీషన్. ఇలాంటి మార్కెట్‌లో 2 కంపెనీలు తమ టారిఫ్‌లు పెంచితే, వినియోగదారుల వద్ద సేవల కోసం మరో ఆప్షన్ ఉండదు.

Frequently Asked Questions

మొబైల్ రీచార్జ్ ధరలు ఎప్పుడు పెరిగే అవకాశం ఉంది మరియు ఎంత శాతం?

త్వరలో 3 నుంచి 4 నెలల్లో మొబైల్ రీచార్జ్ ధరలు 12-15 శాతం వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఇది ఇప్పటికి అధికారిక ప్రకటన కాదు.

రీచార్జ్ ధరలు పెంచడానికి టెలికాం కంపెనీలు చెప్పే కారణాలు ఏమిటి?

నెట్‌వర్క్ విస్తరణ, 5G మౌలిక సదుపాయాలు, స్పెక్ట్రం ఖర్చులు, మరియు ప్రతి కస్టమర్ నుండి వచ్చే ఆదాయం (ARPU) పెంచడం వంటి కారణాలను కంపెనీలు చెబుతున్నాయి.

రీచార్జ్ ధరల పెంపు వినియోగదారులపై ఎలా ప్రభావం చూపుతుంది?

ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ఇప్పుడు రీచార్జ్ కోసం ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు, 500 రూపాయల ప్లాన్ 12-15% పెంపుతో 560-575 రూపాయలు కావచ్చు.

కంపెనీలు లాభాలు ఆర్జించినప్పటికీ, రీచార్జ్ ధరల పెంపుపై ప్రజలు ఎందుకు ప్రశ్నిస్తున్నారు?

Jio మరియు Airtel గత సంవత్సరం 30,000 కోట్లకు పైగా నికర లాభాలు నమోదు చేసినందున, మొబైల్ రీచార్జ్ ధరలు పెంచాల్సిన అవసరం లేదని చాలా మంది వినియోగదారులు భావిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget