అన్వేషించండి

KCR 2004 election affidavit: కేటీఆర్ 'జమీందార్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైండ్ గేమ్‌ - కేసీఆర్ 2004 అఫిడవిట్ లీక్.. అందులో ఏముందంటే?

Zamindar family: కేసీఆర్ కుటుంబానికి 1954 నుంచే భూములు ఉన్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ రీ-కౌంటర్. కేసీఆర్ 2004 ఎన్నికల అఫిడవిట్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశాయి కాంగ్రెస్ వర్గాలు.

Congress vs BRS land debate:  తెలంగాణ శాసనసభ వేదికగా ప్రారంభమైన భూముల రగడ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. కేసీఆర్ కుటుంబానికి వందలాది ఎకరాల భూమి ఉందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను తిప్పికొట్టే క్రమంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వర్గాలు కొత్తగా డాక్యుమెంట్లు లీక్ చేస్తున్నాయి.  మా తండ్రి కేసీఆర్ జమీందారీ కుటుంబానికి చెందినవారు, 1954 నుంచే మాకు వందలాది ఎకరాల భూములు ఉన్నాయి  అని కేటీఆర్ ప్రెస్ మీట్‌లో వ్యాఖ్యానించారు.  దానికి విరుగుడుగా కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ 2004 ఎన్నికల అఫిడవిట్‌ను సోషల్ మీడియా , మీడియా వేదికగా విడుదల చేసి కొత్త చర్చకు తెరలేపారు.

కాంగ్రెస్ వర్గాలు బయటపెట్టిన 2004 లోక్‌సభ ఎన్నికల నాటి కేసీఆర్ అధికారిక అఫిడవిట్ ప్రకారం.. ఆయన పేరిట  వ్యవసాయ భూమి 0 ఎకరాలు ,  వ్యవసాయేతర భూమి 0 ఎకరాలు అని స్పష్టంగా నమోదై ఉంది. 1954 నుంచే వందలాది ఎకరాల జమీందారీ ఆస్తులు తమకు ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించినప్పుడు, 2004 నాటికి అధికారిక అఫిడవిట్‌లో సొంత పేరిట సున్నా ఎకరాలు ఉన్నట్లు ఎందుకు పేర్కొన్నారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.  కేటీఆర్ చెప్పే జమీందారీ లెక్కలు నిజమా? లేక కేసీఆర్ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అధికారిక వివరాలు నిజమా? అంటూ టీపీసీసీ నేతలు నేరుగా నిలదీస్తున్నారు.

ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా పెద్ద అస్త్రాన్ని అందించింది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్‌హౌస్, సిద్దిపేట పరిసరాల్లో ఉన్న 440 ఎకరాల లెక్కలను బయటపెట్టినప్పుడు డిఫెన్స్‌లో పడ్డ బీఆర్ఎస్.. కౌంటర్ ఇవ్వబోయి మరింత వివాదంలో చిక్కుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2004లో సున్నా ఎకరాలు ఉన్న కేసీఆర్ కుటుంబానికి, 2026 నాటికి వందలాది ఎకరాల విస్తారమైన ఫామ్‌హౌస్‌లు, భూకమతాలు ఎలా వచ్చాయనే ప్రశ్నను లేవనెత్తడం ద్వారా ధరణి  పోర్టల్ సమయంలోనే ఈ ఆస్తులన్నీ కూడబెట్టారనే తమ ప్రధాన ఆరోపణకు కాంగ్రెస్ బలం చేకూర్చుకుంటోంది.
KCR 2004 election affidavit: కేటీఆర్ 'జమీందార్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైండ్ గేమ్‌ - కేసీఆర్ 2004 అఫిడవిట్ లీక్.. అందులో ఏముందంటే?

మరోవైపు, కాంగ్రెస్ విడుదల చేసిన అఫిడవిట్‌పై బీఆర్ఎస్ శ్రేణులు కూడా తమదైన రీతిలో సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాల వ్యవస్థలో భూములు పిత్రార్జితంగా లేదా కుటుంబ పెద్దల పేరిట ఉంటాయని, 2004 నాటికి కేసీఆర్ పేరిట ప్రత్యేకంగా రిజిస్టర్ కాకపోవడం వల్ల అఫిడవిట్‌లో సాంకేతికంగా  సున్నా అని నమోదై ఉండవచ్చని బీఆర్ఎస్ మద్దతుదారులు వాదిస్తున్నారు. కేటీఆర్ చెప్పినట్లు కేసీఆర్ తండ్రి ,  పూర్వీకుల కాలం నాటి ఆస్తులనే ఆయన ఉద్దేశించారని, కావాలనే కాంగ్రెస్ సగం సమాచారంతో ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ సోషల్మీడియా కార్యకర్తలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ అఫిడవిట్ అంశంపై ఇంకా బీఆర్ఎస్ అగ్రనేతలు స్పందించలేదు. 

 

 

 ఈ అఫిడవిట్ వార్  తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కుటుంబ ఆస్తుల చుట్టూ తిరుగుతున్న వివాదాన్ని మరింత రాజేసింది. అసెంబ్లీలో మొదలైన భూముల రగడ.. ప్రెస్ మీట్లు, పాత అఫిడవిట్ల తవ్వకాల వరకు వెళ్లడంతో రాబోయే రోజుల్లో 30 రోజుల ఫామ్‌హౌస్ విచారణ నివేదిక వచ్చే వరకు కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఈ పొలిటికల్ ఫైట్ మరిన్ని ఘాటు విమర్శలకు దారితీసేలా కనిపిస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adilabad Politics: కాంగ్రెస్‌ని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన భార్గవ్ దేశ్ పాండే.. సీఎం రేవంత్‌కు సూటిప్రశ్న!
కాంగ్రెస్‌ని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన భార్గవ్ దేశ్ పాండే.. సీఎం రేవంత్‌కు సూటిప్రశ్న!
Hyderabad News: హైదరాబాద్ పాతబస్తీలో దుర్గామాత ఊరేగింపుపై దాడి, తీవ్ర ఉద్రిక్తత- కేసు నమోదు
హైదరాబాద్ పాతబస్తీలో దుర్గామాత ఊరేగింపుపై దాడి, తీవ్ర ఉద్రిక్తత- కేసు నమోదు
El Nino Impact: విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
BRS Leaders Kannepalli Visit: కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
Advertisement

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
El Nino Impact: విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
Ban on non-BS6 vehicles: కాలుష్యంపై కఠిన చర్యలు.. నాన్‌-BS6 వెహికల్స్‌కు నో ఎంట్రీ, PUC లేకుంటే పెట్రోల్‌ కూడా దొరకదు!
మీ వెహికల్‌ BS6 కాదా? అయితే, నవంబర్‌ 1 నుంచి సిటీలోకి 'నో ఎంట్రీ'!
Andhra Pradesh Weather Update: తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
Bihar Politics: జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
Viral Video: నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
Two Wheeler Technology: ఇప్పుడు టూవీలర్లలోనూ లగ్జరీ కార్లకు పోటీగా స్మార్ట్‌ ఫీచర్లు.. ఇలాంటివి ఉన్నట్లు మీకు తెలుసా?
కార్లలోనే కాదు.. టూవీలర్లలోనూ అదిరిపోయే స్మార్ట్ ఫీచర్లు! మీ బండిలో ఇవి ఉన్నాయా?
Crime Thriller OTT : నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
Embed widget