ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ కుటుంబంపై సీఎం చేస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ.. 'రేవంత్.. దీనికి మించిన సెల్ఫ్ గోల్ ఇంకోటి లేదు' అంటూ ఎద్దేవా చేశారు. తాము మొదటి నుంచి భూస్వామ్య కుటుంబం అని, తమకు అప్పట్నుంచే వందల ఎకరాలు ఉన్నాయని స్పష్టం చేసిన కేటీఆర్.. రేవంత్ రెడ్డి తీరుపై సెటైర్లు వేశారు.