అన్వేషించండి

Driver Operator Jobs: ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌లో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. ఈసారి మారిన రూల్స్

AP Fire Department Recruitment | ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ విడుదలయింది. కొత్త రూల్స్ ప్రకారం పోస్టుకు ఎంపిక చేస్తారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.
  • ఎంపిక ప్రక్రియలో దేహదారుఢ్య, రాత పరీక్షలను తప్పనిసరిగా నిర్వహించనున్నారు.
  • వయోపరిమితి 18-30, పదోతరగతి, భారీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
  • దరఖాస్తుల షెడ్యూల్, ఇతర వివరాలు త్వరలో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

AP Fire Department Driver Operator Posts | అమరావతి: ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీ కోసం పోలీసు నియామక మండలి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ, ప్రాథమిక రాత పరీక్ష తేదీలు , ఇతర ముఖ్యమైన వివరాలతో కూడిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే వెల్లడిస్తామని నియామక మండలి ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ మీనా తెలిపారు. గతంలో కూటమి హయాంలో 2018 నవంబరులో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రాగా, 8 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు పోస్టుల భర్తీకి నియామక మండలి చర్యలు చేపట్టింది. అయితే, ఈసారి ఎంపిక ప్రక్రియలో కొన్ని కీలక మార్పులు చేసి దేహదారుఢ్య (పీఈటీ), రాత పరీక్షలను తప్పనిసరి చేశారు.

గత నియామకాల్లో కేవలం శారీరక కొలతలు (ఫిజికల్ మెజర్‌మెంట్) పరీక్ష నిర్వహించి, అందులో అర్హత సాధించిన వారికి డ్రైవింగ్ టెస్ట్ పెట్టి మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసేవారు. కానీ ఈసారి మారిన నిబంధనల ప్రకారం అభ్యర్థులకు మొదట శారీరక కొలతల పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షకు (PET) హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పీఈటీలో భాగంగా అభ్యర్థులు 1,600 మీటర్ల పరుగును 10 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలో పూర్తి చేయాలి. 


Driver Operator Jobs: ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌లో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. ఈసారి మారిన రూల్స్

ఆ పరుగు పందెంలో అర్హత సాధించిన వారికి తదుపరి దశలో ఉన్నతాధికారుల కమిటీ ఆధ్వర్యంలో 100 మార్కులకు డ్రైవింగ్ టెస్ట్ పెడతారు. డ్రైవింగ్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరి దశగా రాత పరీక్ష (Written Test) నిర్వహించి తుది ఎంపిక పూర్తి చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://slprb.ap.gov.in ను సందర్శించవచ్చు.

ఏజ్ లిమిట్
ఫైర్ డిపార్ట్ మెంట్ డ్రైవర్ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి . అంటే ఆ అభ్యర్థులు 1996 జులై 2 తర్వాత, 2008 జులై 1 కి ముందు జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ (EWS) అభ్యర్థులకు ప్రభుత్వం 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. విద్యా అర్హతల విషయానికి వస్తే అభ్యర్థులు పదో తరగతి లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. దీంతో పాటు నోటిఫికేషన్‌ నాటికి కనీసం 2 సంవత్సరాల వ్యాలిడిటీ ఉన్న హెవీ ట్రాన్స్‌పోర్ట్‌ డ్రైవింగ్‌ లైసెన్సు తప్పనిసరిగా కలిగి ఉండాలి. 

2,050 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APSLPRB) 2,050 ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల ప్రకటన విడుదల చేసింది. వీటిలో 438 సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టులు (సివిల్-253, ఏఆర్-116, కమ్యూనికేషన్స్-50, పీటీఓ-10, ఎస్‌పీఎఫ్-9) మరియు 1,156 కానిస్టేబుల్ పోస్టులు (సివిల్, ఏఆర్, ఫైర్, జైళ్లు) ఉన్నాయి.

వీటితో పాటు కమ్యూనికేషన్స్ విభాగంలో 200 కానిస్టేబుళ్లు, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ (పీటీఓ) లో 198 డ్రైవర్లు, 43 సైంటిఫిక్ అసిస్టెంట్లు, 15 మెకానిక్ పోస్టులకు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల రాత పరీక్ష తేదీల వివరాలను బోర్డు త్వరలోనే వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.

 

Frequently Asked Questions

AP అగ్నిమాపక శాఖలో ఎన్ని డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయనున్నారు?

ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖలో మొత్తం 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది.

డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు వయోపరిమితి ఎంత?

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ఈ పోస్టులకు అవసరమైన విద్యార్హతలు, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు ఏమిటి?

అభ్యర్థులు పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు, కనీసం 2 సంవత్సరాల వ్యాలిడిటీ ఉన్న హెవీ ట్రాన్స్‌పోర్ట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్ కలిగి ఉండాలి.

డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల ఎంపిక ప్రక్రియలో ఏమైనా మార్పులు ఉన్నాయా?

అవును, గతంలో కేవలం ఫిజికల్ మెజర్‌మెంట్, డ్రైవింగ్ టెస్ట్ ఉండగా, ఇప్పుడు దేహదారుఢ్య (PET) మరియు రాత పరీక్షలను తప్పనిసరి చేశారు.

దేహదారుఢ్య పరీక్ష (PET)లో అభ్యర్థులు ఏమి చేయాలి?

PETలో భాగంగా అభ్యర్థులు 1,600 మీటర్ల పరుగును 10 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలో పూర్తి చేయాలి. ఇందులో అర్హత సాధిస్తేనే తదుపరి దశలకు వెళ్ళగలరు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget