News
News
X

Lava Blaze Pro: లావా కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేస్తుంది - ఈసారి ప్రో మోడల్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా తన కొత్త స్మార్ట్ ఫోన్ బ్లేజ్ ప్రోను మనదేశంలో లాంచ్ చేయనుంది.

FOLLOW US: 

లావా బ్లేజ్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో జులైలో లాంచ్ అయింది. ఇప్పుడు అందులో ప్రో మోడల్‌ను లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధం అవుతోంది. అదే లావా బ్లేజ్ ప్రో. దీన్ని కంపెనీ టీజ్ చేయడం ప్రారంభించింది. దీనికి సంబంధించిన ట్వీట్‌లో ‘కమింగ్ సూన్’ అని పేర్కొన్నారు. దీన్ని బట్టి ఈ ఫోన్ సెప్టెంబర్‌లోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

లావా షేర్ చేసిన ట్వీట్‌ను బట్టి ఈ ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండనుంది. బ్లూ, గోల్డ్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇవి తప్ప ఈ ఫోన్ గురించి మిగతా సమాచారాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే దీనికి సంబంధించిన వివరాలు కొన్ని ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

ఈ లీకుల ప్రకారం... లావా బ్లేజ్ ప్రోలో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. 6x జూమ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే అందించనున్నారు. హోల్ పంచ్ కటౌట్ కూడా ఉండనుంది. 

లావా బ్లేజ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ జులైలో మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధరను రూ.8,699గా నిర్ణయించారు. గ్లాస్ బ్లాక్, గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్, గ్లాస్ రెడ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.51 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, హోల్ పంచ్ తరహాలో డిజైన్ ఉంది. మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 3 జీబీ ర్యామ్ ఇందులో అందించారు. మరో 3 జీబీ స్టోరేజ్‌ను వర్చువల్ ర్యామ్‌గా ఉపయోగించుకోవచ్చు. అంటే మొత్తంగా 6 జీబీ ర్యామ్ అన్నమాట.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు ఏఐ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. 4జీ వోల్టే, బ్లూటూత్ వీ5, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, వైఫై, జీపీఆర్ఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఉన్నాయి. యాక్సెలరో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్‌ను కూడా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

Published at : 10 Sep 2022 09:09 PM (IST) Tags: Lava New Phone Lava Blaze Pro Launch Date Lava Blaze Pro Lava Blaze Pro Price Lava Blaze Pro Features

సంబంధిత కథనాలు

5G In India: మీ చేతిలో ఉన్న ఫోనే మీకున్న సూపర్ పవర్ - ఇది నిజం

5G In India: మీ చేతిలో ఉన్న ఫోనే మీకున్న సూపర్ పవర్ - ఇది నిజం

ఈ ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా - అయితే మీకు మరిన్ని ఫీచర్లు!

ఈ ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా - అయితే మీకు మరిన్ని ఫీచర్లు!

iQoo 11 Pro Camera: ఐకూ 11 సిరీస్ ఫీచర్లు లీక్ - ప్రపంచంలోనే టాప్ కెమెరాలతో!

iQoo 11 Pro Camera: ఐకూ 11 సిరీస్ ఫీచర్లు లీక్ - ప్రపంచంలోనే టాప్ కెమెరాలతో!

Realme 10: రియల్‌మీ 10 లాంచ్ దగ్గరలో - ఫీచర్లు లీక్ - టెస్టింగ్‌లో సూపర్ స్కోరు!

Realme 10: రియల్‌మీ 10 లాంచ్ దగ్గరలో - ఫీచర్లు లీక్ - టెస్టింగ్‌లో సూపర్ స్కోరు!

Infinix Zero Ultra 5G Launch: అక్టోబర్ 5న ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ లాంచ్ - 200 మెగాపిక్సెల్ కెమెరా, నాలుగు సినిమాల్లోనే సగం చార్జింగ్!

Infinix Zero Ultra 5G Launch: అక్టోబర్ 5న ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ లాంచ్ - 200 మెగాపిక్సెల్ కెమెరా, నాలుగు సినిమాల్లోనే సగం చార్జింగ్!

టాప్ స్టోరీస్

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

INDW Vs SLW, Asia Cup 2022: శ్రీలంకపై చెలరేగిన జెమీమా - ఎంత కొట్టారంటే?

INDW Vs SLW, Asia Cup 2022: శ్రీలంకపై చెలరేగిన జెమీమా - ఎంత కొట్టారంటే?

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?