అన్వేషించండి

iQoo Z6 Lite 5G: మొదటిసారి ఆ ప్రాసెసర్‌తో స్మార్ట్ ఫోన్ - ఐకూ సూపర్ మొబైల్!

ఐకూ జెడ్6 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ ఉండనుందని తెలుస్తోంది.

ఐకూ జెడ్6 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో సెప్టెంబర్ 14వ తేదీన లాంచ్ కానుంది. వివ్ సబ్ బ్రాండ్ అయిన ఐకూ ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను కూడా టీజ్ చేసింది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా, వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్‌లో కూడా ఈ ఫోన్ కనిపించినట్లు తెలుస్తోంది.

ఈ ఫోన్‌లో I2208 మోడల్ నంబర్‌తో గూగుల్ పిక్సెల్ కన్సోల్ లిస్టింగ్‌లో కనిపించింది. దీన్ని బట్టి ఇందులో 6 జీబీ ర్యామ్, మల్టీపుల్ స్టోరేజ్ వేరియంట్లు ఉండే అవకాశం ఉంది. క్వాల్‌కాం ఎస్ఎం4375 అనే మోడల్ నంబర్‌తో ఉన్న ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో అందించనున్నారు. ఇది క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ అయ్యే అవకాశం ఉంది. ప్రపంచంలో ఈ ప్రాసెసర్‌తో లాంచ్ కానున్న మొదటి ఫోన్ ఇదే.

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫన్‌టచ్ ఓఎస్ 12 స్కిన్ కూడా ఇందులో ఉండనుంది. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1,080x2,408 పిక్సెల్స్‌గానూ, పిక్సెల్ డెన్సిటీ 440 పీపీఐగానూ ఉంది. ఐకూ ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్‌ను పలుసార్లు టీజ్ చేసింది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 127 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను ఈ ఫోన్ అందించనుంది.

ఐకూ జెడ్6ఎక్స్ స్మార్ట్ ఫోన్ ఇటీవలే చైనాలో లాంచ్ అయింది. ఇందులో మూడు స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,199 యువాన్లుగా (సుమారు రూ.14,000) నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,399 యువాన్లుగానూ (సుమారు రూ.16,500), 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,599 యువాన్లుగానూ (సుమారు రూ.19,000) ఉంది. బ్లూ ఐస్, బ్లాక్ మిర్రర్, బ్లేజింగ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో కూడా ఈ ఫోన్ త్వరలో లాంచ్ కానుంది.

ఐకూ జెడ్6ఎక్స్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గానూ ఉంది. స్క్రీన్ రిజల్యూషన్ 1080 × 2408 పిక్సెల్స్‌గా ఉండటం విశేషం. మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 44W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Indiramma Houses Scheme In Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Kuppam TDP: కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
Samantha Ruth Prabhu : సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
Pawan Kalyan Comments Row: పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి, డీజీపీ - విమర్శల వాడి పెంచిన వైసీపీ 
పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి, డీజీపీ - విమర్శల వాడి పెంచిన వైసీపీ 
Embed widget