(Source: ECI/ABP News/ABP Majha)
New iPhone SE: త్వరలో కొత్త ఐఫోన్ ఎస్ఈ - మిడ్ రేంజ్ మార్కెట్‌పై గురి పెట్టిన యాపిల్!
యాపిల్ కొత్త ఐఫోన్ ఎస్ఈ మోడల్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది.
యాపిల్ ఐఫోన్ 14 సిరీస్‌ను కంపెనీ గత నెలలో ఫార్ అవుట్ ఈవెంట్లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఐఫోన్ ఎస్ఈ4ను కూడా లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అయితే ఈ ఫోన్ డిస్‌ప్లే వివరాలు లీక్ అయ్యాయి. ఇందులో 6.1 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లేను అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐఫోన్ ఎక్స్ఆర్ తరహా డిజైన్ ఇందులో ఉండనుంది. ఐఫోన్ ఎస్ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు మోడల్స్ లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్‌లో లేటెస్ట్ మోడల్ గతేడాది మార్చిలో లాంచ్ అయింది.
ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్ ఎస్ఈ మోడల్స్‌లో 4.7 అంగుళాల డిస్‌ప్లేనే అందించారు. కొత్తగా రానున్న ఐఫోన్ ఎస్ఈ మోడల్‌లో పంచ్ హోల్ మోడల్ డిస్‌ప్లేను కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. చిన్న సైజు అంచులు, నాచ్, ఫేస్ ఐడీతో ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం.
యాపిల్ తన ముందు వెర్షన్ ఐఫోన్ ఎస్ఈని ఈ సంవత్సరం మార్చిలో లాంచ్ చేసింది. అదే ఐఫోన్ ఎస్ఈ (2022). ఏ15 బయోనిక్ చిప్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ఫోన్ ధరను మనదేశంలో రూ.43,900గా నిర్ణయించారు. ఇది 64 జీబీ వేరియంట్ ధర.
ఐఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 4.7 అంగుళాల రెటీనా హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే చూడటానికి గతంలో లాంచ్ అయిన ఐఫోన్ ఎస్ఈ తరహాలోనే ఉంది. అయితే ఫోన్ ముందువైపు, వెనకవైపు అత్యంత కఠినమైన గ్లాస్‌ను అందించినట్లు యాపిల్ అంటోంది. ఐపోన్ 13, ఐఫోన్ 13 ప్రోల్లో అందించిన గ్లాస్ ప్రొటెక్షన్‌ను యాపిల్ ఇందులో కూడా అందించింది.
ఐఫోన్ 13 సిరీస్‌లో అందించిన ఏ15 బయోనిక్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ చిప్ ద్వారా ఐఫోన్ 8 కంటే 1.8 రెట్లు వేగంగా ఈ ఫోన్ పనిచేస్తుందని కంపెనీ ప్రకటించింది. గతంలో లాంచ్ అయిన ఐఫోన్ ఎస్ఈ తరహాలోనే ఇందులో కూడా వెనకవైపు 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. అయితే ఇందులో మెరుగైన విజువల్ ప్రాసెసింగ్‌ను అందించినట్లు కంపెనీ తెలిపింది. వెనకవైపు కెమెరా డీప్ ఫ్యూజన్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. ఇది 4కే వీడియో రికార్డింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. 60 ఎఫ్‌పీఎస్, స్మార్ట్ హెచ్‌డీఆర్4 వద్ద 4కే వీడియోను రికార్డ్ చేయవచ్చు.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు ఫేస్‌టైం హెచ్‌డీ కెమెరాను అందించారు. 5జీ, 4జీ వోల్టే, వైఫై 5, బ్లూటూత్ వీ5, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, లైటెనింగ్ పోర్టు ఇందులో ఉండనున్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారోమీటర్, గైరో స్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఇందులో ఉండనున్నాయి.
ఇందులో టచ్ ఐడీని అందించారు. ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే రోజంతా చార్జింగ్ వస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇది కీ స్టాండర్డ్ బేస్డ్ వైర్‌లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉందని కంపెనీ తెలిపింది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?