iPhone 15: ఐఫోన్ 15పై భారీ ఆఫర్ - ఇప్పుడు ఎంతకు కొనొచ్చంటే?
iPhone 15 Discount: అమెజాన్‌లో యాపిల్ ఐఫోన్ 15పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. కేవలం రూ.61,900కే దీన్ని కొనుగోలు చేయవచ్చు. అంతే కాకుండా ఎక్స్ ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.
Apple iPhone 15 Discount Offer: ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల విషయానికి వస్తే ఐఫోన్ పేరు మొదట వినిపిస్తుంది. అయినప్పటికీ దీని అధిక ధర కారణంగా ప్రజలు దీన్ని కాకుండా ఇతర ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఐఫోన్ 15పై భారీ తగ్గింపును అందిస్తున్నారు. ఇది మంచి ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.
అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్
ఐఫోన్ 15 128 జీబీ వేరియంట్ అమెజాన్‌లో రూ.79,600కి లిస్ట్ అయింది. దానిపై 17 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత రూ. 65,900కి తగ్గుతుంది. దీంతో రూ. 13,700 ఆదా అవుతుంది. ఇది కాకుండా మీరు ఐసీఐసీఐ, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చెల్లింపు జరిపితే రూ. 4,000 అదనపు తగ్గింపును పొందవచ్చు. ఈ విధంగా దాని ఎఫెక్టివ్ ప్రైస్ రూ. 61,900కి తగ్గుతుంది.
ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో మరింతగా...
అమెజాన్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఆప్షన్ కూడా ఉంది. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే రూ.27,525 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ తర్వాత ఐఫోన్ 15 ధర రూ. 35,000 కంటే తక్కువకు వస్తుంది.
Also Read: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు
డిజైన్: గ్లాస్ బ్యాక్, అల్యూమినియం ఫ్రేమ్‌తో ప్రీమియం లుక్. ఇది ఐపీ68 రేటింగ్‌తో వాటర్ రెసిస్టెన్స్‌ను కూడా కలిగి ఉంది.
డిస్‌ప్లే: హెచ్‌డీఆర్10, డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్న 6.1 అంగుళాల డిస్‌ప్లే ఇందులో అందించారు. ఇది 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను డెలివర్ చేయనుంది.
ప్రాసెసర్: యాపిల్ ఏ16 బయోనిక్ చిప్‌సెట్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. ఇది ఫాస్ట్, స్మూత్ పెర్ఫార్మెన్స్‌ను డెలివర్ చేస్తుంది.
ఆపరేటింగ్ సిస్టమ్: ఐవోఎస్ 17తో ఈ ఫోన్ లాంచ్ అయింది. దీన్ని ఐవోఎస్ 18.1కి అప్‌డేట్ చేయవచ్చు.
స్టోరేజ్, ర్యామ్: 6 జీబీ ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
కెమెరా: 48 మెగాపిక్సెల్ వైడ్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌ను ఫోన్ వెనకవైపు అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. అటువంటి పరిస్థితిలో మీరు ఈ ఫోన్‌ను చాలా చవకగా కూడా కొనుగోలు చేయవచ్చు.
Also Read: రూ.11కే 10 జీబీ డేటా - బెస్ట్ ప్లాన్ తెచ్చిన జియో - కానీ వ్యాలిడిటీ మాత్రం!