Infinix Zero Ultra 5G Launch: అక్టోబర్ 5న ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ లాంచ్ - 200 మెగాపిక్సెల్ కెమెరా, నాలుగు సినిమాల్లోనే సగం చార్జింగ్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ త్వరలో జీరో అల్ట్రా 5జీ అనే ఫోన్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది.
ఇన్‌ఫీనిక్స్ జీరో అల్ట్రా 5జీ స్మార్ట్ ఫోన్ అక్టోబర్ 5వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇందులో 180W ఫాస్ట్ చార్జింగ్‌ను అందించనున్నారు. ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 920 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇన్‌ఫీనిక్స్ జీరో అల్ట్రా 5జీ లాంచ్
అక్టోబర్ 5వ తేదీన ఈ ఫోన్ లాంచ్ కానుందని ప్రకటించారు. అయితే ఏ టైంకి వస్తుందనే సంగతి మాత్రం తెలియరాలేదు. గ్లోబల్ లాంచ్ కాబట్టి ఇండియన్ టైమింగ్స్ ప్రకారం చూసుకుంటే ఈవెనింగ్ టైంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఇన్‌ఫీనిక్స్ జీరో అల్ట్రాలో మీడియాటెక్ డైమెన్సిటీ 920 5జీ ప్రాసెసర్ ఉండనుంది. రెండు కలర్ ఆప్షన్లతో ఈ ఫోన్ లాంచ్ కానుంది. హోల్ పంచ్‌లో సెల్ఫీ కెమెరాను కూడా అందించనున్నారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి. అధికారిక ప్రకటనకు ముందే దీనికి సంబంధించిన కొన్ని రెండర్లు కూడా ఆన్‌లైన్‌లో కనిపించాయి. దీన్ని బట్టి డిజైన్ ఎలా ఉండనుందో తెలుసుకోవచ్చు.
ప్రముఖ టిప్‌స్టర్ పరాస్ గుల్గాని ఈ ఫోన్ లాంచ్ టైమ్ లైన్, ఫీచర్లను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ లీకుల ప్రకారం... ఈ సంవత్సరం అక్టోబర్‌లో ఇన్‌ఫీనిక్స్ జీరో అల్ట్రా 5జీ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. 6.7 అంగుళాల అమోఎల్ఈడీ లేదా కర్వ్‌డ్ డిస్‌ప్లే ఇందులో ఉండనుంది. ఏకంగా 180W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కేవలం నాలుగు నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ ఎక్కుతుందని కంపెనీ అంటోంది.
ఇన్‌ఫీనిక్స్ మనదేశంలో ఇటీవలే స్మార్ట్ 6 హెచ్‌డీ అనే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.6,799 ధరకే అందుబాటులో ఉంది. ఆక్వా స్కై, ఆరిజిన్ బ్లూ, ఫోర్స్ బ్లాక్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌పై ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 6 హెచ్‌డీ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్లు అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండగా, 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 31 గంటల పాటు కాల్ మాట్లాడవచ్చని కంపెనీ అంటోంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో అందుబాటులో ఉంది. ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ లేదు. ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఆధారిత ఎక్స్ఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపై ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 6 హెచ్‌డీ పనిచేయనుంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?