Honor 90 5G: 200 మెగాపిక్సెల్ కెమెరా హానర్ 90 5జీ - మనదేశంలో ధర ఎంత ఉండవచ్చు?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తన కొత్త ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేయనుంది. అదే హానర్ 90 5జీ.
హానర్ 90 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో వచ్చే వారం లాంచ్ కానుంది. హెచ్‌టెక్ పేరుతో ఈ కంపెనీ రానుంది. కంపెనీ తన ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్‌లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇందులో వెనకవైపు 200 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుందని తెలుస్తోంది. ఈ ఫోన్ చైనా మార్కెట్లో ఇప్పటికే లాంచ్ అయింది.
సెప్టెంబర్ 14వ తేదీన ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన మీడియా ఇన్వైట్లను కూడా కంపెనీ పంపడం ప్రారంభించింది. అమెజాన్‌లో ఈ ఫోన్ విక్రయానికి రానుంది.
హానర్ 90 5జీ స్పెసిఫికేషన్లు (అంచనా)
దీనికి సంబంధించిన ఫీచర్లను కంపెనీ టీజ్ చేసింది. 1.5కే రిజల్యూషన్ టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫైడ్ డిస్‌ప్లేను ఇందులో అందించారు. 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది డెలివర్ చేయనుంది. అమెజాన్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన ల్యాండింగ్ పేజీ కూడా చూడవచ్చు. అందులో కొన్ని స్పెసిఫికేషన్లు టీజ్ చేశారు.
ఆండ్రాయిడ్ 13 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 7.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఫోన్ వెనకవైపు 200 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
ఈ ఫోన్ చైనా వేరియంట్‌లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ కర్వ్‌డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 66W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
హానర్ 90 5జీ ధర (అంచనా)
ఈ ఫోన్ చైనాలో మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,499 యువాన్లుగా (సుమారు రూ.29,000) ఉంది. 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,799 యువాన్లుగా (సుమారు రూ.32,680) నిర్ణయించారు. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,999 యువాన్లుగా (సుమారు రూ.35,017) ఉంది. భారతీయ వేరియంట్ ధర సుమారు రూ.35 వేలుగా ఉండే అవకాశం ఉంది.
Experience a seamless blend of beauty and durability. The Honor 90's Quad Curved Floating Display, fortified with the toughest glass, is engineered to elevate your tech experience.
— HTECH (@ExploreHONOR) September 8, 2023
Know more: https://t.co/QTw7mGqlN7 #HONOR90 #ShareYourVibe pic.twitter.com/PYJ1BxRAPf
Read Also: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?
Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial