News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Google Pixel 8 Series: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ధర, ఫీచర్లు లీక్ - ఐఫోన్లకు పోటీనిచ్చే కెమెరాలు!

Google Pixel 8 Launch: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి.

FOLLOW US: 
Share:

గూగుల్ తన పిక్సెల్ 8 సిరీస్‌ను అక్టోబర్ నెలలో లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. అయితే దాని లాంచ్‌కు ముందు కొంతమంది ప్రసిద్ధ టిప్‌స్టర్లు పిక్సెల్ 8 సిరీస్ డిజైన్, స్పెసిఫికేషన్, ధరను కూడా లీక్ చేశారు.

ఇంతకు ముందు గూగుల్ పిక్సెల్ 8 సిరీస్‌కు (Google Pixel 8 Series) సంబంధించిన ప్రమోషనల్ వీడియోను షేర్ చేసింది. దీనిలో కంపెనీ స్మార్ట్‌ఫోన్ కెమెరా గురించి వివరించింది. అలాగే ఇప్పుడు ప్రముఖ టిప్‌స్టర్ Kamila Wojciechowski మరోసారి పిక్సెల్ 8 (Google Pixel 8), పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro) స్పెసిఫికేషన్ల గురించి సమాచారాన్ని షేర్ చేశారు.

గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ధర ఎంత ఉండవచ్చు? (Google Pixel 8 Expected Price)
మార్కెట్లో వినిపిస్తున్న కథనాల ప్రకారం గూగుల్ పిక్సెల్ 8 ధర 699 డాలర్లుగా (సుమారు రూ.51,800) ఉండనుంది. గూగుల్ పిక్సెల్ 8 ప్రో ధరను 899 డాలర్లుగా (సుమారు రూ.74,800) నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది.

గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫీచర్లు (అంచనా) (Google Pixel 8 Pro Specifications)
గూగుల్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో ఫోన్‌లలో చాలా గొప్ప ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో పిక్సెల్ 8 రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ వరకు ఉంటుంది. ఇది 6.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో రానుంది. దీని పీక్ బ్రైట్‌నెస్ 2000 నిట్స్ వరకు ఉండనుంది. అయితే పిక్సెల్ 8 ప్రో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను పొందుతుంది. గూగుల్ పిక్సెల్ 8 ప్రోలో 6.7 అంగుళాల ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించే అవకాశం ఉంది.
 
గూగుల్ టెన్సార్ జీ3 చిప్‌సెట్ పిక్సెల్ 8 సిరీస్‌కు సంబంధించిన రెండు మోడళ్లలో అందించనున్నారు. ఇది టైటాన్ ఎం2 సెక్యూరిటీ కోప్రాసెసర్‌తో జత కానుంది. దీంతో పాటు ఈ సిరీస్‌లో 8 జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ అందుబాటులో ఉంటుంది. పిక్సెల్ 8ని 128 జీబీ, 256 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌లో లాంచ్ చేయవచ్చు. అయితే పిక్సెల్ 8 ప్రోకు 8 జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ లభించనుంది.

పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో ఫోన్‌ల బ్యాటరీ, ఛార్జింగ్ విషయానికి వస్తే, పిక్సెల్ 8లో 4575 ఎంఏహెచ్ బ్యాటరీని ఉండనుంది. ఇది 27W ఫాస్ట్ ఛార్జర్‌ను సపోర్ట్ చేయనుంది. దీంతో పాటు ఇందులో 18W Qi వైర్‌లెస్ ఛార్జర్‌ కూడా ఉండనుంది. మరోవైపు పిక్సెల్ 8 ప్రో 5050 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉండనుంది. ఇది 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను, 23W Qi వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్ చేయనుంది.

కెమెరా సెటప్ హైలెట్ (Google Pixel 8 Camera)
గూగుల్ పిక్సెల్ 8 సిరీస్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ సెన్సార్ ఉంటాయి. ఇది మెరుగైన లైట్ వెర్షన్, హెచ్‌డీఆర్ సామర్ధ్యంతో వస్తుంది. ఈ సెన్సార్ 30 ఎఫ్‌పీఎస్ వద్ద 8కే వీడియోని చిత్రీకరించడానికి కూడా సహాయపడుతుంది. పిక్సెల్ 8లో వినియోగదారులు 11 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను పొందుతారు.

పిక్సెల్ 8 ప్రోలో 11 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉండనుంది. వెనుకవైపు సెటప్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 64 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 49 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?

Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 25 Sep 2023 08:16 PM (IST) Tags: Google Pixel 8 Google Pixel 8 series Google Pixel 8 Pro Google Pixel 8 Leaks Google Pixel 8 Price Google Pixel 8 Specifications

ఇవి కూడా చూడండి

Smartphone Hacking Signs: మీ ఫోన్ ఇలా ప్రవర్తిస్తుందా? - అయితే హ్యాక్ అయినట్లే - రీసెట్ చేయాల్సిందే!

Smartphone Hacking Signs: మీ ఫోన్ ఇలా ప్రవర్తిస్తుందా? - అయితే హ్యాక్ అయినట్లే - రీసెట్ చేయాల్సిందే!

Smartphone Charging Tips: ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? - పేలిపోయే అవకాశం ఉంది జాగ్రత్త!

Smartphone Charging Tips: ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? - పేలిపోయే అవకాశం ఉంది జాగ్రత్త!

Upcoming Smartphones: డిసెంబర్ మొదటి వారంలో ఏకంగా ఐదు ఫోన్లు లాంచ్ - ఏమేం వస్తున్నాయి? - వీటి కోసం వెయిట్ చేయవచ్చా?

Upcoming Smartphones: డిసెంబర్ మొదటి వారంలో ఏకంగా ఐదు ఫోన్లు లాంచ్ - ఏమేం వస్తున్నాయి? - వీటి కోసం వెయిట్ చేయవచ్చా?

Most Secured Smartphone: ప్రపంచంలో అత్యంత సెక్యూర్డ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - ఒక్కదాని పేరైనా మీరు విన్నారా?

Most Secured Smartphone: ప్రపంచంలో అత్యంత సెక్యూర్డ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - ఒక్కదాని పేరైనా మీరు విన్నారా?

Meizu 21: 200 మెగాపిక్సెల్ కెమెరా, లేటెస్ట్ ప్రాసెసర్‌తో గేమింగ్ ఫోన్ - ధర ఎంతంటే?

Meizu 21: 200 మెగాపిక్సెల్ కెమెరా, లేటెస్ట్ ప్రాసెసర్‌తో గేమింగ్ ఫోన్ - ధర ఎంతంటే?

టాప్ స్టోరీస్

Cyclonic Michaung live updates: దూసుకొచ్చిన తుపాను-బాపట్ల దగ్గరగా తీరం దాటే అవకాశం

Cyclonic Michaung live updates: దూసుకొచ్చిన తుపాను-బాపట్ల దగ్గరగా తీరం దాటే అవకాశం

BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ

BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!
×