అన్వేషించండి

Surface Go 3: విండోస్ 11తో మొదటి డివైస్ లాంచ్ చేసిన మైక్రోసాఫ్ట్.. మనదేశంలోనే.. ధర ఎంతంటే?

మైక్రోసాఫ్ట్ సర్పేస్ గో 3 డివైస్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర మనదేశంలో రూ.42,999 నుంచి ప్రారంభం కానుంది.

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ గో 3 మనదేశంలో అధికారికంగా లాంచ్ అయింది. విండోస్ 11తో లాంచ్ అయిన మొదటి మైక్రోసాఫ్ట్ డివైస్ ఇదే. సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో, సర్ఫేస్ ప్రో 8, సర్ఫేస్ డ్యుయో 2లతో పాటు ఇది సెప్టెంబర్‌లోనే లాంచ్ అయింది. మనదేశంలో మాత్రం కాస్త లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా.. లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో వచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సర్పేస్ గో 2 కంటే.. సర్ఫేస్ గో 3 60 శాతం వేగంగా పనిచేస్తుంది. దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 3:2గా ఉంది. వెనకవైపు, ముందువైపు 1080పీ కెమెరాలు అందించారు.

సర్ఫేస్ గో 3 ధర
దీని ధరను మనదేశంలో రూ.57,999గా నిర్ణయించారు. ఇందులో టెన్త్ జనరేషన్ ఇంటెల్ పెంటియం గోల్డ్ ప్రాసెసర్‌ను అందించారు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఎస్ఎస్‌డీని ఇందులో అందించారు. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే అమెజాన్‌లో ప్రారంభం అయ్యాయి. ప్రీ-ఆర్డర్ చేసిన వినియోగదారులకు రూ.9,699 విలువైన సర్పేస్ పెన్‌ను ఉచితంగా అందించనున్నారు. నవంబర్ 23వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది.

బిజినెస్ కస్టమర్లకు దీన్ని రూ.42,999కే విక్రయించనున్నారు. అయితే ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఈఎంఎంసీ స్టోరేజ్ ఉండనుంది. ఇందులో ఇంటెల్ ఐ3 ప్రాసెసర్ వేరియంట్ వేరియంట్ కూడా ఉంది. దీని ధర రూ.47,999గా ఉంది. ఐ3 ప్రాసెసర్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఎస్ఎస్‌డీ ఉన్న వేరియంట్ ధర రూ.62,999గా ఉంది. ఇవి ఆథరైజ్డ్ రీసెల్లర్ల వద్ద డిసెంబర్ నుంచి అందుబాటులో ఉండనున్నాయి.

సర్ఫేస్ గో 3 స్పెసిఫికేషన్లు
స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. సర్ఫేస్ గో 2కి, సర్ఫేస్ గో 3కి పెద్ద తేడాలు కనిపించవు. ఇందులో 10.5 అంగుళాల టచ్ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 3:2గా ఉంది. ఇందులో వెనకవైపు, ముందువైపు 1080పీ కెమెరాలు అందించారు. డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. ఇందులో స్టూడియో మైక్రో ఫోన్లు కూడా అందించారు.

కనెక్టివిటీ మరింత వేగంగా ఉండేందుకు ఇందులో ఆప్షనల్ ఎల్టీఈ అడ్వాన్స్‌డ్ ఫీచర్ కూడా ఉంది. ఈ ట్యాబ్లెట్ సర్ఫేస్ గో సిగ్నేచర్ టైప్ కవర్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. దీన్ని డిటాచబుల్ కీబోర్డులా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. లేటెస్ట్ సాఫ్ట్ వేర్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఇందులో ప్రీలోడెడ్ విండోస్ 11ను అందించారు.

Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?

Also Read: రూ.10 వేలలోనే ఒప్పో కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!

Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం
Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం
How To Recover Deleted WhatsApp Messages: వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
How To Free Up Storage On Android Phones: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Embed widget