అన్వేషించండి

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Edge vs Chrome: గూగుల్ క్రోమ్ కంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కొన్ని విషయాల్లో ముందుంది. మరి వీటిలో ఏది బెస్ట్?

Microsoft Edge Vs Google Chrome: ప్రస్తుత కాలంలో మనం ఇంటర్నెట్‌లో ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటే, మనం గూగుల్ బ్రౌజర్‌ని ఉపయోగిస్తాం. అది మొబైల్ అయినా, ల్యాప్‌టాప్ అయినా ఏదైనా సరే. మనం గూగుల్ వెబ్ బ్రౌజర్‌కు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాం. గూగుల్ వెబ్ బ్రౌజర్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దాని మార్కెట్ వాటా దాదాపు 65 శాతంగా ఉంది. చాలా సందర్భాల్లో గూగుల్ వెబ్ బ్రౌజర్ మార్కెట్‌లో ఉన్న ఇతర వెబ్ బ్రౌజర్‌ల కంటే మెరుగ్గా ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం అంత మెరుగ్గా ఉండదు. ఈ కథనంలో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌ని గూగుల్ క్రోమ్ కంటే మెరుగ్గా మార్చిన  మూడు కారణాలను తెలుసుకుందాం.

మీరు ప్రైవసీని ఎక్కువ కోరుకునేవారైతే మైక్రోసాఫ్ట్ బ్రౌజర్‌ని ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇది థర్డ్ పార్టీ కుకీలు, ట్రాకర్‌లను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది. తద్వారా వెబ్‌సైట్‌లు, అడ్వర్‌టైజర్లు మీ డేటాను సేకరించలేరు.

మెరుగైన ప్రైవసీ, సెక్యూరిటీ
మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌ మెరుగైన ప్రైవసీ, సెక్యూరిటీకి ప్రసిద్ధి చెందింది. ఇతర బ్రౌజర్‌లతో పోలిస్తే ఈ వెబ్ బ్రౌజర్ ఆటోమేటిక్‌గా థర్డ్ పార్టీ కుకీలు, ట్రాకర్‌లను బ్లాక్ చేస్తుంది. దీని కారణంగా వెబ్‌సైట్‌లు, ప్రకటనదారులు మీ డేటాను సేకరించలేరు. ఇది మీరు కస్టమైజ్ చేయదగ్గ ఇన్‌బిల్ట్ ట్రాకర్ ప్రివెన్షన్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది.

ఇది కాకుండా ఎడ్జ్ ఆన్‌లైన్ ప్రమాదాల నుంచి మిమ్మల్ని రక్షించే అనేక భద్రతా ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఇది ఫిషింగ్, మాల్వేర్ వెబ్‌సైట్‌లను నిరోధించడంలో సహాయపడే మైక్రోసాఫ్ట్ డిఫెండర్ స్మార్ట్‌స్క్రీన్‌ని కలిగి ఉంటుంది. అదనంగా ఇన్‌ప్రైవేట్ బ్రౌజింగ్ అందుబాటులో ఉంది. ఇది మీ బ్రౌజింగ్ హిస్టరీ, కుకీలు, తాత్కాలిక ఫైల్స్‌ను మీ కంప్యూటర్‌లో సేవ్ చేయకుండా నిరోధిస్తుంది. ఈ వెబ్ బ్రౌజర్‌లో మీరు సందర్శించే ప్రతి వెబ్‌సైట్‌ను దాని సొంత ప్రక్రియలో వేరుచేసే సైట్ ఐసోలేషన్ ఫీచర్ కూడా ఉంది. ఇది ప్రమాదకరమైన వెబ్‌సైట్‌లు మీ డేటాను యాక్సెస్ చేయకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.

యూజర్ ఫ్రెండ్లీ బ్రౌజర్
గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్‌తో పోలిస్తే మైక్రోసాఫ్ట్ బ్రౌజర్ మీకు మెరుగైన యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఇందులో మీరు ట్యాబ్‌లను వర్టికల్‌గా చూసే సదుపాయం, రీడింగ్ మోడ్, రీడ్ అవుట్ లౌడ్, ఇతర ఉపయోగకరమైన ఫీచర్‌లను కూడా పొందుతారు. గూగుల్ క్రోమ్ లాగా ఇందులో కూడా మీరు వివిధ రకాల ఎక్స్‌టెన్షన్‌లను పొందుతారు.

విండోస్ ఇంటిగ్రేషన్
గూగుల్ క్రోమ్ బ్రౌజర్ మీకు గూగుల్ డిజిటల్ ఎకోసిస్టమ్‌తో మైల్డ్ ఇంటిగ్రేషన్ అందించినట్లే, ఎడ్జ్ బ్రౌజర్...  విండోస్ 10, విండోస్ 11 కోసం డిఫాల్ట్ బ్రౌజర్‌గా ఉంటుంది. ఈ ఆపరేటింగ్ సిస్టంతో బాగా కలిసిపోయింది. ఈ ఇంటిగ్రేషన్లు మీ విండోస్ క్రెడెన్షియల్స్ ఉపయోగించి వెబ్‌సైట్‌లకు సైన్ ఇన్ చేయడానికి, మీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజింగ్ హిస్టరీ, వేరే విండోస్ డివైసెస్ నుంచి మీకు కావాల్సిన వాటిని యాక్సెస్ చేయడానికి, ఎడ్జ్ హ్యాండ్స్ ఫ్రీని కంట్రోల్ చేసేందుకు కోర్టానాను ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget