Micromax in 2b Launch: మైక్రోమాక్స్ నుంచి కొత్త ఫోన్.. 8 వేల లోపే ధర..
మైక్రోమాక్స్ కొత్త స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. మైక్రోమాక్స్ ఇన్ 2బీ పేరున్న ఈ ఫోన్.. యూనిసోక్ టీ610 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర రూ.7,999గా నిర్ణయించింది.
మైక్రోమాక్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌ను తీసుకొచ్చింది. మైక్రోమాక్స్ ఇన్ 2బీ (Micromax In 2b) పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.7,999గా నిర్ణయించింది. యూనిసోక్ టీ610 ప్రాసెసర్‌తో ఇది పనిచేస్తుంది. డ్యుయల్ కెమెరా ఆప్షన్ కూడా ఇందులో ఉంది. గతంలో ఇదే కంపెనీ నుంచి వచ్చిన మైక్రోమాక్స్ ఇన్ 1బీ తర్వాతి వెర్షన్‌గా ఇది ఎంట్రీ ఇచ్చింది.
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,999గా.. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999గా ఉంది. ఇది బ్లాక్, గ్రీన్, బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్, మైక్రోమాక్స్ కంపెనీ వైబ్ సైట్ల ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు. దీని సేల్ ఆగస్టు 6న మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది.
5000 ఎంఏహెచ్..
మైక్రోమాక్స్ ఇన్ 2బీలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. దీని ప్లేబ్యాక్ టైమ్ 160 గంటల పాటు ఉంటుందని కంపెనీ తెలిపింది. వెబ్ బ్రౌజింగ్ చేస్తే 20 గంటల పాటు.. వీడియో స్ట్రీమింగ్ ద్వారా 15 గంటలు.. టాక్ టైం ద్వారా 50 గంటల వరకు ఉంటుందని పేర్కొంది. ఇందులో రెండు కెమెరాలు ఉన్నాయి. ప్రైమరీ కెమెరా 13 మెగా పిక్సెల్స్ .. సెకండరీ కెమెరా 2 మెగా పిక్సెల్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కెమెరాలో నైట్ మోడ్, లైట్, పోర్టైట్, బ్యూటీ, మోషన్ ఫొటో వంటి ఫీచర్లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 5 మెగా పిక్సెల్స్ సామర్థ్యం ఉన్న ఫ్రంట్ కెమెరాను అందించారు.
వాటర్‌డ్రాప్ స్టైల్ డిస్‌ప్లే..
- ఇందులో 6.52 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ వాటర్‌డ్రాప్ స్టైల్‌లో ఉండే నాచ్ డిస్‌ప్లే ఉంటుంది.
- డ్యుయల్ సిమ్ (నానో) మైక్రోమాక్స్ ఇన్ 2బీ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది.
- బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ కోసం యూనిసోక్ టీ610 ప్రాసెసర్ ను ఉపయోగించారు. 400 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది.
- స్క్రీన్ టు బాడీ రేషియో 89 శాతంగా.. యాస్పెక్ట్ రేషియో 20: 9 శాతంగా ఉంది.
- మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.
- భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్లను అందించారు.
- ఫోన్ వెనకవైపు ప్యానెల్‌పై డ్యూయల్ ప్యాటర్న్ డిజైన్‌ను కలిగి ఉంది.
- కనెక్టివిటి ఫీచర్లుగా.. డ్యుయల్ వోవైఫై, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ వీ5, జీపీఎస్, యూఎస్‌బీ టైప్ సీ పోర్టు వంటివి ఉన్నాయి.
- ప్రొక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, యాక్సెలరో మీటర్ వంటివి ఉన్నాయి.