Mi LED TV 4C: అదిరిపోయే ఫీచర్స్‌తో ఎంఐ 4C టీవీ వచ్చేసింది.. ధర చూస్తే ఎగిరి గంతేస్తారు...
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఎంఐ నుంచి ఎల్ఈడీ టీవీ 4సీ స్మార్ట్ టీవీ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. షియోమీ నుంచి వచ్చిన బడ్జెట్ టీవీలలో ఇది కూడా ఒకటి.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఎంఐ నుంచి బడ్జెట్ రేంజ్‌లో కొత్త టీవీ ఇండియాలో లాంచ్ అయింది. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4సీ (Mi LED TV 4C) పేరున్న ఈ స్మార్ట్ టీవీ భారత మార్కెట్లోకి సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. షియోమీ నుంచి వచ్చిన బడ్జెట్ టీవీలలో ఇది కూడా ఒకటి. ఇందులో 32 అంగుళాలు డిస్‌ప్లే ఉండనుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ ఆధారితమైన ప్యాచ్‌వాల్ యూఐ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేయనుంది.
మిగతా ఎంఐ టీవీలతో పోలిస్తే దీని అంచులు కాస్త మందంగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఉండే ఎంఐ క్విక్ వేవ్ ఫీచర్ ద్వారా ఇది కేవలం 5 సెకన్లలోనే ఆన్ అవుతుందని కంపెనీ చెబుతోంది. ఇందులో క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో పాటు 1 జీబీ ర్యామ్ ఉండనుంది.
ధర, వేరియంట్లు..
ఎంఐ ఎల్ఈడీ టీవీ 4సీ ఒకే వేరియంట్‌లో (32 అంగుళాలు) లభిస్తుంది. దీని ధర రూ.15,999గా ఉంది. ఇది బ్లాక్ కలర్ ఆప్షన్లో మాత్రమే లభిస్తుంది. దీనిని ఎంఐ ఇండియా వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు కార్డులపై రూ.1000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈజీ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
ఫీచర్లు ఇవే..
ఎంఐ ఎల్ఈడీ టీవీ 4సీ టీవీలో 32 అంగుళాల హెచ్‌డీ రెడీ (1,366x768 పిక్సెల్స్) డిస్‌ప్లే ఉండనుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 Hzగా, వ్యూయింగ్ యాంగిల్ 178 డిగ్రీలుగా ఉంటుంది. దీని రెస్పాన్స్ సమయం కేవలం 8 మిల్లీసెకన్లు మాత్రమే. ఇది షియోమీ వివిడ్ పిక్చర్ ఇంజిన్ ఆధారంగా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ టీవీ ఆధారిత ప్యాచ్‌వాల్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్‌ను కూడా సపోర్టు చేస్తుంది.
దీనికి 64 బిట్ అమ్‌లాజిక్ కార్టెక్స్ ఏ53 క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది మాలి 450 ఎంపీ3 జీపీయూతో కలిపి వస్తుంది. ఇందులో 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ ఉండనున్నాయి. కనెక్టివిటీ ఆప్షన్లుగా.. బ్లూటూత్ వీ4.2, వైఫై, మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు (వీటిలో ఒకటి ఏఆర్సీని సపోర్ట్ చేస్తుంది), రెండు యూఎస్‌బీ 2.0 పోర్టులు, ఒక ఏవీ పోర్టు, ఎథర్‌నెట్ పోర్టు, ఇయర్‌ఫోన్ అవుట్ ఫీచర్లు ఉన్నాయి.
10 వాట్స్ స్పీకర్లు..
డీటీఎస్ హెచ్‌డీ ఆడియోను సపోర్ట్ చేసే 10 వాట్స్ స్పీకర్లు ఇందులో ఉన్నాయి. ఈ టీవీ రిమోట్‌లో వాయిస్ అసిస్టెంట్ బటన్ ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు ప్రత్యేకమైన బటన్లను ఇచ్చారు. ఓటీటీ యాప్స్‌కు సంబంధించిన సమాచారాన్ని ప్యాచ్‌వాల్ ఇంటర్‌ఫేస్ ద్వారా సెర్చ్ చేసే సౌకర్యం ఉంది. పేరెంటల్ లాక్ అనే ఫీచర్‌ను కూడా అందించారు. ఈ టీవీ మందం 2.97 సెంటీమీటర్లుగా, బరువు 3.87 కేజీలుగా (స్టాండ్ లేకుండా) ఉండనుంది.